ఖమ్మం

నేడు గజలక్ష్మి అలంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 11: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో లక్ష్మీతాయారు అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్ష్మిః గజేందైః మణిగణఖచితైః స్నాపితా హేమకుంబైః అని కీర్తిస్తారు పూర్వాచార్యులు. అమ్మను ఆరాధిస్తే అధికారం, మహా సంపద కలుగుతాయని శాస్త్రం. గజలక్ష్మిని ఆరాధించినందుకే దేవేంద్రుడు త్రైలోకాధిపత్యాన్ని సాధించినట్లు పురాణంలో ఉంది.

రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి
* ఏరియా జీఎం రమణమూర్తి
కొత్తగూడెం రూరల్, అక్టోబర్ 11: సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంతో పాటు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించేందుకు అధికారులు, కార్మికులు కృషి చేయాలని ఏరియా జీఎం కెవి రమణమూర్తి అన్నారు. రుద్రంపూర్‌లోని జీఎం కార్యాలయంలో గురువారం ఉత్పత్తిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి సింగరేణిభవన్‌లో జరిగిన సిఎండి సమావేశంలోని అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా జిఎం మాట్లాడుతూ గత నెల వర్షం కారణంగా ఉత్పత్తిలో కొద్దిగా ఆటంకం ఏర్పడిందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు కొత్తగూడెం ఏరియా లక్ష్యాన్ని అధిగమించి అన్ని ఏరియాల కన్న ముందంజలో ఉన్నప్పటికి కంపెనీ వ్యాప్తంగా లక్ష్యాన్ని సాధించడానికి ఏరియాలో రోజుకు సుమారు 35వేల టన్నుల ఉత్పత్తి, 8 రేకుల రవాణా చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగూడెం ఏరియాలో సామర్ధ్యం ఎక్కువగా ఉందన్నారు. ఏరియా వ్యాప్తంగా ఉన్న ఓపెన్‌కాస్టు బొగ్గుగనుల్లో ఉన్న అంశాలను వినియోగించుకొని ఎక్కడ ఉత్పత్తికి అవకాశం ఉంటుందో అక్కడ తగిన రక్షణసూత్రాలను పాటించి అధికోత్పత్తిని సాధించాలన్నారు. ఇతర గనులలో సాధించలేని లక్ష్యాలను భర్తీచేస్తూ సంస్థ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నెలవారీ టార్గెట్‌లను పూర్తి చేయాలని సూచించారు. రెండుఓపెన్‌కాస్టు గనులలో జరుగుతున్న ఓవర్‌బర్డెన్ తొలగింపు పనులను, బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణాపై పిఓలు, ఏజెంట్లు, శాఖాధిపతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తి లక్ష్యసాధనకు ఎదురయ్యే అటంకాలను, కావాల్సిన సౌకర్యాల గురించి చర్చించారు. లక్ష్యాలను సాధిస్తున్న గనుల పనితీరును అభినందించారు. రక్షణపై తగిన శ్రద్ధచూపాలని, రక్షణలేని ఉత్పత్తి వ్యర్ధమన్నారు. విద్యుత్ సంస్థ నుండి బొగ్గుకు అధిక డిమాండ్ ఉందని, ఉత్పత్తితో పాటు రవాణకు, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఓటుజిఎం నారాయణరావు, ఏరియా ఇంజనీర్ దామోదర్‌రావు, పిఓలు సంజీవరెడ్డి, విజయభాస్కర్, ఏజెంట్లు బైద్య, జిపి రావు, అడిషనల్ జిఎం శ్రీనివాస్, డిజిఎంలు జ్యోతి, సూర్కనారాయణ, సేఫ్టి ఆఫీసర్ తివారీ తదితరులు పాల్గొన్నారు.