ఖమ్మం

మధిర నియోజకవర్గంలో 2,00,026మంది ఓటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, అక్టోబర్ 14: మధిర నియోజకవర్గంలో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికలకు అధికారులు ప్రకటించిన ఓటర్ల సంఖ్య 2,00,026మంది ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,01,538 ఉండగా,98,479మంది పురుష ఓటర్లు ధర్డ్‌జెండర్ ఓటర్లు 9మంది ఉన్నారు. పురష ఓటర్లకంటే మహిళా ఓటర్లు 3,059మంది అధికంగా వున్నారు. 2014లో జరిగిన ఎన్నికలలో నియోజకవర్గంలో 1,96,917మంది ఓటర్లు వుండగా 2018 ఎన్నికల నాటికి 3,109ఓట్లు పెరిగి ఓట్ల సంఖ్య 2,00,026ఓట్లకు చేరుకొంది. మధిర మండలంలో50,665ఓట్లు ఉండగా వీటిలో మహిళా ఓటర్లు 25,769మంది, పురుష ఓటర్లు 24,593మంది, ధర్డ్‌జెండర్ ఓట్లు 3వున్నాయి. అదే విధంగా ఎరుప్రాలెం మండలంలో మొత్తం 36,399ఓట్లు వుండగా వీరిలో మహిళా ఓటర్లు 18,294మంది, పురుష ఓటర్లు 18,102మంది, ధర్డ్‌జెండర్ ఓటర్లు 3వున్నారు.బోనకల్ మండలంలో మొత్తం 32,487మంది ఓటర్లు వుండగా వీరిలో16,335మంది మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు 16,151మంది, ధర్డ్‌జెండర్ ఓటు 1వుంది. చింతకాని మండలంలోమొత్తం 37,211మంది ఓటర్లు వుండగా వీటిలోమహిళా ఓటర్లు 19,095మంది, పురుష ఓటర్లు 18,112మంది, ధర్డ్‌జెండర్ ఓటు 1వుంది. ముదిగొండ మండలంలో మొత్తం 43,264మంది ఓటర్లు వుండగా వీటిలోమహిళా ఓటర్లు 22,042మంది, పురుష ఓటర్లు 21,221మంది, ధర్డ్‌జెండర్ ఓటు 1ఉంది. నియోజకవర్గంలోని 5మండలాలలో కూడా మహిళా ఓటర్లే అధికంగా వున్నారు.

ఓటింగ్ శాతం పెరిగేందుకు కృషిచేయండి
* ఖమ్మం గెలుపు చారిత్రాత్మకం కావాలి * టిఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ

ఖమ్మం, అక్టోబర్ 14: ఖమ్మం నియోజకవర్గంలో ప్రతిఒక్కరూ తమ ఓటును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పువ్వాడ అజయ్‌కుమార్ నగరంలోని అన్ని డివిజన్ల పార్టీ బాధ్యులకు సూచించారు. ఆదివారం స్ధానిక రోటరీనగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్ నుండి ఓటింగ్ శాతం పెరిగే విధంగా ఇప్పటి నుండే కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందించిన వివిధ రకాల సంక్షేమ పధకాల్లో ఏదో ఒకటి ప్రతి గుమ్మాన్ని తాకిందని, వాటిని గుర్తించి వారికి వివరించి ఓట్లు అభ్యర్ధించాలన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలతో, సుపరిపాలన అందించాలంటే టిఆర్‌ఎస్ అభ్యర్ధులనే గెలిపించుకోవాలనే భావన ఓటర్లలో కలిగేలా ప్రతి కార్యకర్త ముందుకుసాగాలని ఆయన కోరారు. ఖమ్మం నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ గెలుపు కీలకం కావాలని, గులాబీ జెండా ఖమ్మం ఖిలాపై రెపరెపలాడాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బత్తుల మురళి, తెరాస నగర కమిటీ అధ్యక్షుడు కమర్తపు మురళి, ఆయా డివిజన్ల కార్పోరేటర్లు, అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.