ఖమ్మం

పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధిగా కందాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, నవంబర్ 14: పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కందాల ఉపేందర్‌రెడ్డి అధిష్టానం ఎంపిక చేసింది. కందాల ఉపేందర్‌రెడ్డి 9జనవరి 1960సంవత్సరంలో రాజ్‌పేట గ్రామంలో నర్సింహరెడ్డి మోహినిదేవి దంపతులకు జన్మించాడు. కందాల ఉపేందర్‌రెడ్డి సైఫాబాద్ సైన్స్ కళాశాలలో బిఎస్సీని పూర్తి చేశారు. కందాలకు బార్య విజయ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తండ్రి నరసింహరెడ్డి 1970 నుండి 1990 వరకు 20 సంవత్సరాలు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్‌గా పదవి నిర్వహించారు. తల్లి మోహిని దేవి డిసిసి డైరక్టర్‌గా పనిచేశారు. అలాగే పెద్దన్నయ సురేందర్‌రెడ్డి ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్‌గా పదవి నిర్వహించారు. కందాల ఉపేందర్‌రెడ్డి 1960 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి రంగప్రవేశం చేసి అప్పటి నుండి అనేక స్వచ్చంద కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అందరిని అదుకుంటు ఉండేవాడు. మొదటి నుండి రాజకీయ కుటుంబ కావటంతో ప్రజలతో కలసిమెలసి ఉండేవాడు. 2009 సంవత్సరంలో పాలేరు నియోజకవర్గం అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నించి అధిష్టానం ఆదేశాల మేరకు తప్పుకోని కాంగ్రెస్ పార్టీ గెలుపుకృషి చేశారు. రాజకీయ గురువువైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి కందాల.
మొట్టమొదటి నామినేషన్ దాఖలు చేస్తున్న నంబూరి
సత్తుపల్లి, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సత్తుపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి నామినేషన్‌ను భారతీయ జనతాపార్టీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు బుధవారం దాఖలు చేశారు. ఆయన తన పార్టీ నాయకులతో కలిసి సత్తుపల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారి బి శివాజికు తన నామినేషన్‌కు సంబంధించిన మొదటి సెట్టును ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ శుభగడియల నేపథ్యంలో తన నామినేషన్ మొదటి సెట్టును ఎన్నికల అధికారికి అందించానని ఈ నెల 19న మిగతా నామినేషన్ సెట్లను కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి సమక్షంలో దాఖలు చేయనున్నట్లు తెలిపారు.