ఖమ్మం

జిల్లాలో ఐదు నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 14: ఎన్నికల నామినేషన్ల దాఖలుకు మూడవరోజైన బుధవారం జిల్లాలో మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. మధిర టిఆర్‌ఎస్ అభ్యర్థిగా లింగాల కమలరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. పాలేరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి ఎన్నికల అధికారికి నామినేషన్‌ను అందజేశారు. సత్తుపల్లి బీజేపీ అభ్యర్థిగా నంబూరి రామలింగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. వైరా నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా భూక్యా శేష్మాబాయి ఆ పార్టీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. వైరా నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా వర్సా రాములు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 11నామినేషన్లు దాఖలయ్యాయి.
భద్రాద్రి జిల్లాలో 12 నామినేషన్లు దాఖలు
కొత్తగూడెం, నవంబర్ 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మూడో రోజు బుధవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇల్లందు నియోజకవర్గం నుంచి తాజా మాజీ శాసన సభ్యుడు కోరం కనకయ్య టిఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా, సిపిఐ (ఎంఎల్), న్యూ డెమొక్రసీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నర్సయ్య తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. టిఆర్‌ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా దేవీలాల్ నాయక్, స్వతంత్ర అభ్యర్థిగా బానోతు హరిప్రియ నామినేషన్ దాఖలు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి తాజా, మాజీ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు టిఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా, ప్రముఖ వైద్యుడు భూక్యా ప్రసాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సీపీఎం అభ్యర్థిగా తానం రవీందర్ నామినేషన్ దాఖలు చేశారు. పినపాక కాంగ్రెస్ అభ్యిర్థిగా రేగా కాంతారావు, బీజేపీ అభ్యర్థిగా చందా సంతోష్ కుమార్, కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తరఫున ఆయన తనయుడు వనమా రామకృష్ణ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వర్ణలతకు అందజేశారు. భద్రాచలం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా గుండు శరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఐదు నియోజకవర్గాల్లో 12 నామినేషన్ దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.