ఖమ్మం

తెలంగాణ ఏర్పాటు వద్దన్న చరిత్ర భట్టిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిఠ నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికలు 60 ఏళ్ళపాటు ప్రజలను క్షోభకు గురిచేసిన ఢిల్లీ కాంగ్రెస్ దొరల అహంకారానికి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీటిఆర్ పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థిగా లింగాల కమల్‌రాజు నామినేషన్ వేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల ఢిల్లీ దొరల కాంగ్రెస్‌కు, దొరల మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్న సామాన్య ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. భట్టి ఎంఎల్‌సిగా వున్న సమయంలో తెలంగాణను ఏర్పాటు చేయవద్దని కాంగ్రెస్ ఎంఎల్‌సీలను, ఎంఎల్‌ఎలను ఢిల్లీకి తీసుకువెళ్ళింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కన్నీళ్ళే మిగులుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం 45 వేల కోట్లతో 453 సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జెండా, ఎజెండా లేకుండా కాంగ్రెస్, టీడీపీలు పొత్తుపెట్టుకోవడంతో దివంగత ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ల ఆత్మలు క్షోభిస్తున్నాయన్నారు. కమల్‌రాజును గెలిపిస్తే మధిర నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాడన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా ప్రజలు అభివృద్ధి చేసేవారికి అండగా వుండి గెలిపిస్తారన్నారు. ప్రాంతీయ పార్టీలు రెండు రాష్ట్రాలలో మనుగడ సాగించలేవనే టిఆర్‌ఎస్‌లో చేరడం జరిగిందన్నారు. ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించినప్పుడు 130 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలతో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని సంతకాలు సేకరించిన భట్టివిక్రమార్క కాంగ్రెస్ హై కమాండ్ ఒత్తిడితో ఆ సంతకాల జాభితాను బుట్ట దాఖలు చేసి జగన్‌ను జైల్లో పెట్టించింది మీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. వైసిపి తరుపున గెలిచి టిఆర్‌ఎస్‌లోకి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకే వెళ్ళానని ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పే దమ్ము తనకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సభలో టీఆర్‌ఎస్ మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజు టీఆర్‌ఎస్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, బుడాన్ బేగ్, నల్లమల వెంకటేశ్వరరావు, గడిపల్లి కవిత, బొమ్మెర రామ్మూర్తి, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, మొండితోక నాగరాణి, మల్లాది వాసు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
లింగాల కమల్‌రాజు నామినేషన్ దాఖలు
మధిర నవంబర్ 14: టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు బుధవారం మధిర రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతికి నామినేషన్ పత్రం అందజేశారు. లింగాల కమల్‌రాజు వెంట రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, దొండపాటి వెంకటేశ్వరరావు, చైర్‌పర్సన్ మొండితోక నాగరాణి ఉన్నారు. నామినేషన్ వేసిన అనంతరం టిఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితేనే సాధ్యవౌతుందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి అయితే సాగర్ జలాల చివరి భూములుగా ఉన్న మధిర నియోజకవర్గానికి సాగునీరు అందడం వలన ఈ ప్రాంతానికి సాగునీటి సమస్య తీరి రైతులు అనందరంగా ఉంటారన్నారు. మధిర తాజా మాజీ ఎంఎల్‌ఎ భట్టివిక్రమార్క గత నాలుగు సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నా కాలయాపన చేశారని కమల్‌రాజు విమర్శించారు. అటువంటి దుస్థితి మధిర నియోజకవర్గానికి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న తనను గెలిపించాలని కమల్‌రాజు ఈ సందర్భంగా మధిర నియోజకవర్గ ప్రజలను కోరారు. గెలిపిస్తే హైదరాబాద్‌లో ఉండకుండా మధిర నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని, మధిరను అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచాతానన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు భద్రాచలం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, మల్లాది వాసు, మొండితోక సుధాకర్, మందడపు తిరుమలరావు, దేవిశెట్టి రంగారావు, అరిగె శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.