ఖమ్మం

పాలేరు ప్రచార పర్వంలో నేతల మాటల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 8: పాలేరు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ప్రచార ప్రారంభ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కొంత తటస్థంగా వ్యవహరించినప్పటికీ పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది విమర్శలకు పదునుపెడుతూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో ఆదివారం కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నేతల మాటలు రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించాయి. రాష్టమ్రంత్రి కెటిఆర్ పాలేరులో తమ అభ్యర్థి ఓటమి పాలైతే తాను పదవికి రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. దానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కెటిఆర్‌ను బచ్చాగా అభివర్ణిస్తూ సవాల్‌ను కొట్టిపారేశారు. తాను నాలుగు సార్లు గెలిచిన స్థానంలో శ్రీకాంతాచారి తల్లిని పోటీలో ఉంచి ఆమెను అవమానించారని ఏద్దేవా చేశారు. పార్టీలో చేరిన అనేక మందికి పదవులు ఇచ్చిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం మరణించిన శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. పాలేరు ఎన్నికల్లో ఓటమి భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామాల వారిగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని, వారి ఓటమికి ఇదే నాందిగా మారిందన్నారు. ఒక శాసనసభ్యుడు మరణిస్తే మానవత్వంతో వారి కుటుంబానికి అండగా ఉండాల్సిన నేతలు ఎన్నికల్లో పోటీకి పెట్టి మానవత్వాన్ని మంట గలిపారన్నారు.
ఇదిలా ఉండగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ పథకాలతో పాటు కాంగ్రెస్ నేతల వైఖరిని ఎండ గడుతున్న టిఆర్‌ఎస్‌కు అదేరీతిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఒక గ్రామంలో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఒకరు ప్రభుత్వానికి అనుకూలంగా, మరోకరు వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ప్రధాన నేతలు ఖమ్మంలోనే గత కొన్ని రోజులుగా మకాం వేసి ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.