ఖమ్మం

ప్రజాభీష్టం మేరకే పోటీ:నామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 14: ప్రజల అభీష్టం మేరకే ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, ఇకనుంచి ఖమ్మంలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని ఖమ్మం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం నగరానికి చేరుకున్న ఆయనకు మహాకూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వందలాది వాహనాలతో ఆయనకు ఎదురేగి స్వాగతం పలికి నగరంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నగరమంతా భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోకి అడుగుపెట్టే సమయంలో మహాకూటమిలో భాగస్వాములైన సీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, కాంగ్రెస్ ప్రచార కమిటీ నియోజకవర్గ చైర్మన్ సంధ్యారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలో పలుచోట్ల నామ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ద్వారా ఎదిగి పదవులు పొంది ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేశారన్నారు. కానీ పార్టీ కార్యకర్తలు ధైర్యంతో నిలబడి ఖమ్మంలో తెలుగుదేశం అత్యంత బలమైనదిగా నిలబెట్టారన్నారు. దేశ అవసరాల రీత్య మహాకూటమి ఏర్పడిందని, దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నాడు తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అమలయ్యేలా అధికారంలోకి రాగానే చూస్తామన్నారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మహాకూటమిలోని కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితిలు తనకు మద్దతివ్వడం మరింత బలాన్నిచ్చిందని, వారందరినీ కలుపుకొని ప్రజల వద్దకు వెళ్తామన్నారు. నాలుగున్నరేళ్ళలో రాష్ట్రానికి జరిగిన నష్టం, ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు వివరించి వాటి పరిష్కారానికి తాము చేపట్టే కార్యక్రమాలను వివరిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేనన్నారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి కార్యకర్తలు గజమాలలతో ఆయనను సత్కరించారు. ప్రదర్శన పొడవునా పూలుచల్లుతూ నామపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామ నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణకుమారి, పార్టీ నేతలు శివయ్య, హరికృష్ణ, సరిపుడి సతీష్, మందడపు వెంకటేశ్వరరావు, జీవన్‌కుమార్, చిరుమామిళ్ళ నాగేశ్వరరావు, కనకమేడల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.