ఖమ్మం

గతంలో విద్యుత్ ఉంటే వార్త.. ఇప్పుడు పోతే వార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, నవంబర్ 14: ఉమ్మడి రాష్ట్రాన్ని 67 ఏళ్ళపాటు పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల్లో రైతులకు 24గంటలు కరెంటు ఉంటే అది వార్త, కాని 4 ఏళ్ళ తెలంగాణా ప్రభుత్వంలో కరెంటుపోతే వార్త అవుతుందని టీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి తరపున ప్రచారానికి వచ్చిన ఆయన డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని 67 ఏళ్లపాటు పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు రైతుల కోసం చేసింది శూన్యమన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే రైతులకు 24 గంటల పాటు వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ను ఉచితంగా అందించారని చెప్పారు. అదే విధంగా రైతుబంధు పథకంతో ఏడాదికి ఎకరాకు రూ.8 వేలతో పాటు రైతు బీమాతో రూ.5లక్షలు ప్రమాదబీమా కల్పించారని చెప్పారు. సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు, ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వమేనన్నారు. తెలంగాణా రాకముందు రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేదని తెలంగాణా వచ్చిన తరువాత రైతుల మోములో చిరునవ్వులు కనిపిస్తున్నాయని, రైతు భరోసా ప్రభుత్వం దేశం మొత్తంమీద తెలంగాణా ప్రభుత్వంగా మారిందని చెప్పారు. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళు తరలించేందుకు సీతారామప్రాజెక్టు ప్రవేశపెట్టామని, ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలని చూస్తుంటే పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టుని అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతూ కేంద్రానికి 36 లేఖలు పంపారన్నారు. గోదావరి జలాలు అడ్డుకుంటున్న తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేస్తే మనకన్ను మనచేత్తోనే పొడుచుకున్నట్లు అవుతుందన్నారు. సత్తుపల్లికి గోదావరి జలాలు రావాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలన్నారు. సిద్ధాంతాలు లేని కాంగ్రెస్, టీడీపీలకు ప్రజాక్షేమం కోరే కేసీఆర్‌ను గద్దె దింపటం కోసం మహాకూటమి ఏర్పాటు చేశారని పొరపాటున మనజుట్టును వాళ్ళచేతికి ఇస్తే అధోగతిపాలు చేస్తారని విమర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాద్‌రావు, జలగం వెంకటరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు గతంలో అనేక పార్టీల్లో పనిచేసి ప్రత్యర్థులుగా ఉన్నప్పటికి తెలంగాణా రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వమే భవిష్యత్ అని టిఆర్‌ఎస్ పార్టీలో కలిసి పనిచేస్తున్నారన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా తెలంగాణా వాదం వినిపించినట్లవుతుందని కెటిఆర్ చెప్పారు. పిడమర్తి రవి కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉదయం 12గంటల 20 నిమిషాలకు హైదరాబాద్‌నుంచి హెలికాప్టర్‌లో సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లిరోడ్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగిన ఆయన అక్కడి నుండి కార్యకర్తలతో ర్యాలీగా ప్రధాన రహదారి మీదుగా బహిరంగ సభస్థలానికి చేరుకున్నారు. ఈ బహిరంగ సభలో తాజామాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిధులుగా ప్రసంగించారు. బహిరంగ సభలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పి చైర్మన్ గడిపల్లి కవిత, నియోజకవర్గ ఇంచార్జ్ నూకల నరేష్‌రెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బుడాన్‌బేగ్, డాక్టర్ మట్టా దయానంద్ ప్రసంగించారు.