ఖమ్మం

తెలంగాణలోనే మధిరలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.27 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నియోజకవర్గంలో2,03,132 ఓట్లు ఉండగా వీటిలో 1,85,391మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలలో 89.50శాతంతో 1,76,287 మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఈ ఎన్నికలలో 91.27శాతంతో గతం కంటె సుమారు 9వేల మంది అధనంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధిర మండలంలో మొత్తం 51,590 ఓట్లు వుండగా 45,262 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 87.73శాతం పోలింగ్ నమోదు అయింది. ఎర్రుపాలెం మండలంలో మొత్తం 36,876మంది ఓటర్లు ఉండగా 34,064 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 92.37శాతం పోలింగ్ నమోదు అయింది. బోనకల్ మండలంలో మొత్తం 32,966మంది ఓటర్లు ఉండగా 30,612మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 92.86శాతం పోలింగ్ నమోదు అయింది. చింతకాని మండలంలో మొత్తం 37,837 మంది ఓటర్లు ఉండగా 35,288మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 93.26శాతం పోలింగ్ నమోదు అయింది. ముదిగొండ మండలంలో మొత్తం 43,863 మంది ఓటర్లు ఉండగా 40,165 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చింతకాని మండలంలో అత్యధికంగా 93.26శాతం పోల్‌కాగ, మధిర మండలంలో తక్కువగా 87.73శాతం పోలింగ్ నమోదు అయింది. నియోజకవర్గం మొత్తం మీద 92,052మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకోగా, 93,338 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల కంటే షుమార్ 9వేల ఓట్లు అధికంగా పోల్ కావడం, పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా పోల్ కావడం ఎవరికి కలసి వస్తుందో ఈ నెల 11న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది. ఏదీ ఏమైనా రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

5 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
* కౌంటింగ్ కేంద్రం చుట్టూ పోలీస్ బలగాలు
పాల్వంచ రూరల్, డిసెంబర్ 8: జిల్లాలోని 5 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కౌంటర్ కేంద్రాలను పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కళాశాలలో రెండు బ్లాకులను కలెక్టర్ రజిత్‌కుమార్‌షైని పరిశీలించారు. అక్కడ కౌంటింగ్ టేబుల్స్, ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూశారు. కొత్తగూడెం, ఇల్లందు, అశ్వరావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను రెండు బ్లాకుల్లో ఏర్పాటు చేశారు. కళాశాల నుంచి పలు నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక దారులు ఏర్పాటు చేశారు. ఒక బ్లాకులో ఇల్లందు, పినపాక నియోజవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా మరో బ్లాకులో కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు కావల్సిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఇవిఎం బాక్సుల భద్రత కోసం అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్య ఎదురుకాకుండా ట్రాన్స్‌కో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవిఎంలలోని ఓట్లు లెక్కించాలంటే కచ్చితంగా విద్యుత్ ఉండాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగినా లెక్కింపు ఆగకుండా జనరేటర్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు సిఆర్‌పి పోలీసులు 80 మంది, ఎఆర్ గార్డులు, ఒక డిఎస్‌పి, ఒక ఆర్‌ఐతో పాటు స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని నియమించారు.