ఖమ్మం

వైభవంగా అధ్యయనం.. ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 8: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో శనివారం అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రామక్షేత్రం మార్మోగింది. భక్తులతో కిటకిటలాడింది. తొలుత ఉత్సవమూర్తులకు అంతరంగికంగా ప్రత్యేక స్నపనం నిర్వహించారు. స్వామివారు తొలి రోజున మత్య్సావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు మత్య్సావతారంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశ్వక్షేన పూజ, పుణ్యాహచవనం నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనార్థం నిత్య కల్యాణ మండపానికి స్వామిని తీసుకొచ్చారు. ముందుగా మత్య్సావతారంలో స్వామిని అందంగా అలంకరించారు. భక్తులు రామనామ సంకీర్తన చేస్తూ మత్య్సావతార రూపుడైన స్వామివారిని దర్శించి తరించారు.

తొళక్కంతో శ్రీకారం
అధ్యయనోత్సవాల్లో భాగంగా చతుర్వేద పారాయణం, రామాయణ పారాయణం చేసే రుత్వికులకు దీక్షా వస్త్రాలను భద్రాద్రి దేవస్థానం ఈవో తాళ్ళూరి రమేష్‌బాబు అందజేశారు. తర్వాత ప్రత్యేక ఆరాధనలో ముందుగా వేదాలు, ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రి క్షేత్ర మహత్యం, దివ్య ప్రబంధంలో అధ్యయనాన్ని ప్రారంభించారు. దీనినే సంప్రదాయబద్ధంగా తొళక్కం అంటారు. ఈ సందర్భంగా గంటపాటు నాళాయర దివ్య ప్రబంధంలోని పద్యాలను సేవా కాలం చేశారు. అనంతరం మత్య్సావతార రూపుడైన స్వామివారిని నిత్య కల్యాణ మండపానికి తీసుకు రాగా భక్తులు దర్శించారు. అంతకు ముందు శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాలతో పాటు 12 ఆళ్వార్ విగ్రహాలను నిత్య కల్యాణ మండపం వేదిక వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనానికి కల్యాణ మండపం వేదిక వద్ద భక్తులు బారులు తీరారు. స్వామిని మేళతాళాలు, భాజా భజంత్రీలు, కోలాటాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మిథిలా స్వాగత ద్వారం వద్దకు తీసుకురాగానే ఒక్కసారిగా జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్ అంటూ భక్తులు నినదించారు.

నేడు కూర్మావతారం
దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని, అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మంధరగిరి మునిగిపోసాగింది. దేవతలు, రాక్షసుల ప్రార్థన మేరకు శ్రీహరి కూర్మావతారాన్ని ధరిస్తాడు. మునిగిపోయిన మంధర పర్వతాన్ని తన వీపున నిలుపుకుని మునిగిపోకుండా చేస్తారు. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శనిగ్రహ సంబంధ దోషాలు తొలుగుతాయని ప్రతీతి.

దొంగ ఓట్ల సంస్కృతిని ప్రేరేపిస్తున్న టీఆర్‌ఎస్
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ : శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ దొంగ ఓట్ల సంస్కృతిని ప్రేరేపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి ఆరోపించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల నియంత ప పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. అందుకోసం ప్రజాకూటమికి మద్దతు తెలిపితే ఎలాగైనా గెలవాలన్న పంతంతో ప్రజలను, టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విద్యా సంస్థలో చదివే విద్యార్థులను, ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేసి ప్రలోభ పెట్టి అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసి దొంగ ఓట్లను వేయించారన్నారు. ఎక్కడెక్కడ నుండో చదువుకోసం వచ్చిన విద్యార్థులకు సంవత్సరం క్రితమే ఖమ్మంలో ఓట్లు నమోదు చేయించి వారిని చదువులో ఫెయిల్ చేయిస్తానని బెదిరించి దొంగ ఓట్లను వేయించారని దుయ్యబట్టారు. అంతే కాకుండా ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించి పోలింగ్ కేంద్రం వద్ద తన పార్టీ కండువను వేసుకొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారని ఆరోపించారు. ఖమ్మంలోని 206,207పోలింగ్ స్టేషన్‌లలో దగ్గరుండి దొంగ ఓట్లు వేయిస్తున్న అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికైన ఖమ్మం నియోజకవర్గంలోని 206, 206ఎ, 207పోలింగ్ స్టేషన్‌లలో జరిగిన ఎన్నికను రద్దు చేసి తిరిగి మూడు పోలింగ్ కేంద్రాలలో రీ పోలింగ్ చేయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులను, ఖమ్మం నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిని డిమాండ్ చేశారు. ఇటువంటి దుష్ట రాజకీయాలకు చరమగీతం పాడాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు గోడ్డేటి మాధవరావు, మీగడ రామారావు, తన్నీరు రవి, పల్లెబోయిన చంద్రం తదితరులు పాల్గొన్నారు.