ఖమ్మం

ఓట్ల లెక్కింపుకేంద్రంలో పటిష్ట భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), డిసెంబర్ 10: కొణిజర్ల మండల పరిధిలో ఓట్ల లెక్కింపుకేంద్రాన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. సోమవారం ఆయన లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 5 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన లెక్కింపు కేంద్రంలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నిరంతరం లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ సెంటర్ ఆవరణంలో సెంటర్ ఫోర్స్, వెలుపల స్ఫెషల్ పార్టీలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 300మంది పోలీస్ సిబ్బందితో అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అందులో భాగంగా కౌంటింగ్ రోజున ఎన్నికల నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ కేంద్రాలకు సంబందించి ఎన్నికల అధికారులు జారీచేసిన గుర్తింపు పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ఆయా నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాలలోకి అనుమతిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తామని వారివెంట వచ్చే గన్‌మెన్‌లను సైతం అనుమతించమన్నారు. మీడియా పాస్‌లు ఉన్నవారిని మాత్రమే మీడియా పాయింట్ కేంద్రానికి అనుమతిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రంలోపలకు ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదని, బైట ఆవరణంలోని పార్కింగ్ ప్రదేశాలలో ఒక క్రమ పద్ధతిలో పార్క్ చేసుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు, తినుబండారాలు, వాటర్ బాటిల్స్, ఎలాక్ట్రానిక్ పరికరాలతో పాటు అగ్గిపెట్టెలు సైతం అనుమతించేది లేదన్నారు. ఈ విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రైడే పాటిస్తున్నందున మద్యం సేవించిన వారిని లోనికి అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి మురళీధర్, ఎఆర్ అడిషనల్ డిసిపి శ్యాంసుందర్, ఎస్బీ ఏసిపి సత్యనారాయణ, సిఆర్‌పిఎఫ్ అస్టెంట్ కమాండెంట్ జోగేష్‌కుమార్, వైరా ఏసిపి ప్రసన్నకుమార్, ఏఆర్ ఏసిపిలు రియాజ్, విజయబాబు, సిఐ రమాకాంత్, ఆర్‌ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.