ఖమ్మం

సమష్టి కృషితో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 12: ప్రజా కూటమి నేతల సమష్టి కృషి ఫలితంగా శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి విజయం సాధించామని ప్రజా కూటమి నేతలు వనమా వెంకటేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, కంచర్ల గోపాలకృష్ణ ప్రకటించారు. బుధవారం స్థానిక సూర్యా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మేరకు పనిచేసి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కూటమికి అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత చేరువవుతామని అన్నారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చేలా భవిష్యత్‌లో పని చేయాలని కోరారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఓడిపోతామనే భయంతో టిఆర్‌ఎస్ నాయకులు అర్ధరాత్రి క్రమబద్ధీకరణ పట్టాల జిరాక్స్‌లు పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పట్టాలు రెవెన్యూ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిన సంఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఇదే ఐక్యత కొనసాగిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా కూటమికి పట్టం కట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గొల్లపల్లి దయానంద్, ఎస్‌కె సాబీర్‌పాషా, ఎంఎ రజాక్, డాక్టర్ శంకర్‌నాయక్, రావి రాంబాబు, గిడ్ల పరంజ్యోతి, కాసుల ఉమారాణి, కాసుల వెంకటేశ్వరరావు, నాగ సీతారాములు, మోత్కూరి ధర్మారావు, జినుగు బాలశౌరి, ఎర్రా కామేష్, వై శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వాలి
ఖమ్మం రూరల్, డిసెంబర్ 12: అభివృద్ధికి మారుపేరైన తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి పదవి ఇచ్చి ఆయన రాజకీయ అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు వినియోగించాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు బుధవారం వివిధ మాధ్యమాలలో విన్నవించుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో భగీరథ, మిషన్ కాకతీయేమోగానీ...్భగీరధుడంటే తుమ్మలేనని పేర్కొన్నారు. ప్రజలు నిజాయతీ గల నాయకుడ్ని వదులుకున్నారు. నిజం నిలకడగా తెలుస్తుంది. రాష్ట్రంలో, జిల్లాలో ఏ మారుమూల గ్రామాలను పరిశీలించినా లింక్‌రోడ్లు దర్శనమిస్తున్నాయి. పాలేరు నియోజకవర్గంలో వేసవి కాలంలో కూడా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయంటే.. అది ఆ నాయకుడి పుణ్యమే అంటున్నారు. అశ్వారావుపేట మొదలుకొని ఇటు పాలేరు నియోజకవర్గం వరకూ ప్రతి పల్లెలో నీటికొరత తీర్చిన తుమ్మల శ్రమ ఏనాటికీ వృధాకాదంటున్నారు. 1973లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సాగర్ కాల్వ తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఆ విషయం కొంతమందికే తెలుసు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు కొన్ని లక్షల వేలకోట్ల రూపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలు అప్పుడే మరిచిపోయారు. పది రూపాయలిచ్చి చెడును దూరం చేసుకోవాలి...అదే పదిచ్చి మంచిని కొనుక్కోవవాలన్న సామెతను ప్రజలు గుర్తెరగాలని పలువురు వ్యక్తులు వివిధ మాధ్యమాలలో పేర్కొనడం గమనార్హం. తుమ్మల మంత్రిగా మా నియోజకవర్గానికి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు ఎంతో మేలు చేశారు. ప్రజలు తెలిసో...తెలియకో ఎన్నికల్లో దూరం పెట్టినంత మాత్రాన కలత చెంది పాలేరు నియోజకవర్గంపై చిన్నచూపు చేసుకోవద్దని.. ఆ నియోజకవర్గంలో తనను అమితంగా అభిమానించే సామాన్య ప్రజలు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాలేరులో తుమ్మలకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలకించి తుమ్మలకు సరిజోడి అయిన మంత్రి పదవినిచ్చి ఆయన రాజకీయ జీవితానికి సార్ధకత చేకూర్చాలని నియోజకవర్గ ప్రజలు మనసారా కోరుకుంటున్నారు.