ఖమ్మం

ఖమ్మం తీర్పు విలక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 12: ఉద్యమాలకు ఖిల్లాగా పేరుగాంచిన ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ విలక్షణ తీర్పులే వస్తాయి. రాష్టవ్య్రాప్తంగా ఒక పార్టీకి ప్రజలంతా మద్దతు పలికితే ఖమ్మం జిల్లాలో మాత్రం దానికి వ్యతిరేకమైన పార్టీకి పట్టం కడుతుంటారు. 2014ఎన్నికల్లో రాష్టవ్య్రాప్తంగా టిఆర్‌ఎస్ గెలిస్తే ఖమ్మంలో మాత్రం ఆ పార్టీకి ఒక్క స్థానమే దక్కింది. 2018ఎన్నికల్లో కూడా రాష్టవ్య్రాప్తంగా ప్రజలంతా టిఆర్‌ఎస్ వైపు ఉంటే ఖమ్మం జిల్లాలో కేవలం ఒక్క స్థానంలోనే ఆ పార్టీ విజయం సాధించింది. మరోవైపు ఖమ్మం నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే ఆనవాయితీ ఉండేది. ఖమ్మం జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఈ పరిస్థితే కొనసాగుతున్నది. కానీ తాజా ఫలితాల్లో ఖమ్మం స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలవగా రాష్ట్రంలో కూడా ఆ పార్టీయే విజయం సాధించింది. ఖమ్మం నియోజకవర్గంలో గెలుపొందిన ప్రతి అభ్యర్థి ఇప్పటివరకు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరగ్గా ఖమ్మం నియోజకవర్గంలో 11సార్లు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్ మూడుసార్లు, టీడీపీ ఒక్కసారి విజయం సాధించింది. కమ్యూనిస్టు యోధులుగా పేరుగాంచిన రజబ్‌అలీ, నల్లమల గిరిప్రసాద్, పువ్వాడ నాగేశ్వరరావు, మంచికంటి రామకిషన్‌రావు, తమ్మినేని వీరభద్రం లాంటి వారు ఇక్కడి నుంచే గెలిచారు. 1994లో ఇక్కడి నుంచి గెలిచిన పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ పక్షనాయకునిగా పనిచేశారు. 2014ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్ గెలిచి తరువాత టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో గత ఆనవాయితీ తీర్పును ప్రజలు పక్కనపెట్టి అధికార పక్షానికి చెందిన పువ్వాడ అజయ్‌కుమార్‌ను గెలిపించడం విశేషం. మరోవైపు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి తొలిసారి వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో తొలిసారి సిపిఐ, తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. ఆ రెండుసార్లు గెలిచిన నేతలు ఇప్పుడు టిఆర్‌ఎస్‌లోనే ఉన్నారు.
ఇదిలా ఉండగా ఖమ్మం నియోజకవర్గంలో గెలిచిన వారు ఎవరూ ఇంతవరకు రాష్టమ్రంత్రిగా పనిచేసిన దాఖలాలు లేవు. ఖమ్మంలో ఒకసారి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన సత్తుపల్లి, పాలేరులలో గెలిచినప్పుడు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. అయితే ఈసారి టిఆర్‌ఎస్ ఖమ్మం స్థానంలోనే గెలవడం, ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో ఖమ్మంలో గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రిపదవి దక్కే అవకాశం ఉంది. అలాగే కొత్తవారిని ఆదరించడం ఖమ్మం వారికి ఆనవాయితీగా ఉండేంది. దానిని ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో యధావిధిగా కొనసాగించడం విశేషం.

ఖమ్మం జిల్లాలో ముగ్గురికీ పదవులు?

ఖమ్మం, డిసెంబర్ 12: రాష్ట్ర తీర్పుకు భిన్నంగా విలక్షణ తీర్పునిచ్చే ఖమ్మం జిల్లాకు వివిధ పార్టీల తరపున ఈసారి మూడు పదవులు దక్కే అవకాశం ఉంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ స్థానాల్లో ప్రజాకూటమి అభ్యర్థులు విజయం సాధించడం, టీఆర్‌ఎస్ ఒక్క స్థానానికే పరిమితం కావడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రెండు స్థానాల్లోనే విజయం సాధించడంతో సత్తుపల్లిలో గెలిచిన సీనియర్ నేత సండ్ర వెంకటవీరయ్య ఆ పార్టీ పక్షనేతగా ఎన్నికయ్యే అవకాశం కానుంది. అలాగే జిల్లా నుంచి టీఆర్‌ఎస్ తరపున ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాత్రమే గెలిచిన నేపథ్యంలో ఆయనకు మంత్రిపదవి దక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా మధిరలో గెలిచిన కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్కకు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గత శాసనసభలో సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి ఓటమి చెందడంతో శాసన మండలి సభ్యునిగా, మూడుసార్లు శాసన సభ్యునిగా గెలవడమే కాకుండా, డెప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవంతో భట్టిని సీఎస్పీ నేతగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో గెలిచినప్పటికీ ఆయన పీసీసీ అధ్యక్షునిగానే కొనసాగుతారని సమాచారం. వరుసగా మూడుసార్లు విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య, మల్లు భట్టివిక్రమార్కలకు రాష్టస్థ్రాయిలో ప్రోటోకాల్‌తో కూడిన రెండు ప్రధాన పదవులు రానున్నాయనే ప్రచారంతో జిల్లాలో ప్రజాకూటమి శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖమ్మం నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలు సండ్రకు ప్రధాన పదవి దక్కనుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విలక్షణమైన తీర్పుతో ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ స్థానాలు కట్టపెట్టినప్పటికీ జిల్లా నుండి వివిధ పార్టీల నేతలకు మూడు అరుదైన పదవులు ఖమ్మం జిల్లాకే చెందనున్నట్లు తెలుస్తోంది.