ఖమ్మం

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియామకంతో గూడెంలో సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహణ అధ్యక్షునిగా కల్వకుంట్ల తారక రామారావును అధిష్టానం నియమించటంతో శుక్రవారం కొత్తగూడెంలో గులాబీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో, మాజీ శాసనసభ్యుడు జలగం వెంకటరావు క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు ఊకంటి గోపాలరావు వర్గం నాయకులు వేర్వేరుగా సంబరాలు జరుపుకున్నారు. కొత్తగూడెంలోని మాజీ శాసనసభ్యుడు జలగం వెంకటరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కంచర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేటీఆర్ తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కీలక దశకు చేరుకున్న క్రమంలో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో తారక రామారావు పనిచేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రిగా, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచానికి చాటారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కేటీఆర్‌కు అవార్డులు లభించాయని అన్నారు. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న గ్రామ పంచాయతీ, జడ్పీటిసి, ఎంపిటిసి, కోఆపరేటివ్ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు కేటీఆర్ నాయకత్వంలో కార్యకర్తలు సమష్టిగా శ్రమించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహణ అధ్యక్షునిగా ఎంపిక చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు, కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో జలగం పాత్ర కీలకమైనదని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బానోతు కేస్లీ, కోఆపరేటివ్ చైర్మన్ మండే వీర హనుమంతరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిలాల్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షురాలు లక్ష్మీబాయి, మున్సిపల్ కౌన్సిలర్లు మోరె భాస్కర్, ధర్మరాజు, మామిడి శ్రీనివాస్, నర్శింహ, యూసుఫ్, టిఆర్‌ఎస్ నాయకులు గొల్ల శ్రీను, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కార్యనిర్వాహణ అధ్యక్షునిగా నియమించినందుకు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు కొదమసింహం పాండురంగాచారి, లక్కినేని వెంకట సాయికృష్ణ, దాసిరెడ్డి వెంగళ కృష్ణప్రసాద్, కందుల సుధాకర్‌రెడ్డి, సరిత, సంగీత, శిరీష, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నర్సెస్ క్వార్టర్స్‌లో గోపాలరావు ఇంటి వద్ద టిఆర్‌ఎస్ కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమిరెడ్డి, కుదురుపాక రాజేంద్ర ప్రసాద్, బందెల విజయేందర్, తాండ్ర నాగబాబు, సుధాకర్‌రెడ్డి, కలకోట శేఖర్‌బాబు, కాసాని రమేష్, రావూరి వీరభద్రం, సతీష్, అజయ్, జల్లి కిరణ్, నర్సయ్య, రాము, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వైరాలో గెలిచిన ఎమ్మెల్యేల రూటే సపరేటు
కారేపల్లి, డిసెంబర్ 14: ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గంలో వైరా శాసనసభ స్థానంలో గెలిచిన ఎమ్మెల్యేల రూటే సపరేటుగా ఉంటుంది. తెలంగాణా రాష్ట్రం అంతా ఒకెత్తు అయితే ఖమ్మం జిల్లా ఒకెత్తు అందునా వైరా నియోజకవర్గం నుండి గెలిచినవారు మరింత దూకుడుగా ప్రవర్తించారు. జిల్లా అంతా కారు జోరు తగ్గి మహాకూటమి అభ్యర్థులు గెలుపొందగా వైరా నియోజకవర్గంలో మాత్రం స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టడం విశేషం. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రాధాన్యత ఈ నియోజకవర్గానికి ఉంది. అదేమంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థులు ఎవ్వరూ తాము గెలిచిన చోట ఉండరు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ తప్పనిసరిగా ఇప్పటి వరకు గెలిచినవారు చెప్పుకొచ్చారు. గతాన్ని పరిశీలిస్తే వైరా శాసనసభా నియోజకవర్గానికి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సీపీఐ నుండి గెలుపొందిన బానోత్ చంద్రావతి గెలిచిన కొన్నినాళ్ళకే అధికారంలో ఉన్న కారు పార్టీలో చేరిపోయింది. రెండవసారి వైఎస్‌ఆర్‌సీపీ నుండి గెలిచిన మదన్‌లాల్ తన వెంట ఉండి అన్నీ తానై చూసుకున్న పొంగులేటి కంటే ముందే కారులోకి జంప్ చేశారు. తాజాగా మూడవసారి జరిగిన ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములునాయక్ సైతం తనేమి తక్కువ తినలేదని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శనివారం కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. జిల్లా ఖమ్మం స్థానంలో గెలిచిన కారు పార్టీకి స్వతంత్ర ఎమ్మెల్యే చేరికతో బలం రెండుగా మారనుంది. ఏది ఏమైనా వైరా శాసనసభ స్థానంలో ఎవ్వరు గెలిచినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ముగిసిన బీసీ ఓటర్ల గుర్తింపు గ్రామసభలు
తిరుమలాయపాలెం, డిసెంబర్ 14: మండలంలోని వివిధ గ్రామాలలో బిసి ఓటర్ల గుర్తింపు గ్రామసభలు శుక్రవారంతో ముగిసాయి. ఓటర్ల జాబితాలోని ఓటర్లను గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహించారు. ఈగ్రామసభల్లో ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. ఈగ్రామసభలు బచ్చోడుతండా, బచ్చోడు, జూపెడ, రఘునాధపాలెం, పైనంపల్లి, తాళ్ళచెరువు, తిమ్మక్కపేట తదితర గ్రామాలలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ బి జయరామ్, ఎంపిడిఓ కార్యాలయం పర్యవేక్షకులు నాసర్ అహ్మద్, ఇఓపిఆర్‌డి డి రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు బాణోతు బాలాజీ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.