ఖమ్మం

ప్రాతినిధ్యం కోల్పోయన తుమ్మల, జలగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట, డిసెంబర్ 14: ఐదు దశాబ్దాల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జలగం, తుమ్మల కుటుంబీకులకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీలో ఖమ్మం నుండి గెలుపొందిన ఏకైక నేత పువ్వాడ అజయ్‌కుమార్ చుట్టూ జిల్లా రాజకీయాలు తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. జలగం కుటుంబానికి జిల్లాలో ఘనమైన చరిత్రే వుంది. జలగం వెంగళరావు జిల్లాపరిషత్ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన సోదరుడు కొండలరావు ఖమ్మం నుండి రెండుసార్లు ఎంపిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా సేవలందించారు. వెంగళరావుపెద్దకుమారుడు ప్రసాదరావు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గాను, పంచాయితీరాజ్ శాఖా మంత్రి గా పనిచేసారు. చిన్నకుమారుడు వెంకట్రావు సత్తుపల్లి, కొత్తగూడెం నుండి రెండుసార్లు శాసనసభ్యునిగా సేవలందించారు. ఖమ్మం జిల్లా అంటే జలగం జిల్లా, జలగం అంటే ఖమ్మం అన్నంతగా జలగం కుటుంబం ప్రభావితం చేసింది. జలగం కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకొచ్చిన తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుండి శాసనసభ్యునిగా ఎన్నికై తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా సేవలందించి జిల్లా అంతటా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సత్తుపల్లి కేంద్రంగా రాజకీయాలు నెరిపిన జలగం - తుమ్మల కుటుంబాలు ఢీ అంటే ఢీ అనే రీతిలో రాజకీయాలను చేశారు. నియోజక వర్గాల పునర్విభజనతో సత్తుపల్లిని వీడినా వీరి మధ్య ఆధిపత్య పోరు ఆగలేదు. ఖమ్మం నుండి జలగం వెంకట్రావుతో పోటీపడి తుమ్మల విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తుమ్మల ఖమ్మం నుండి పరాజయం పాలవగా టిఆర్‌ఎస్ తరుపున పొటీ చేసిన వెంకట్రావు కొత్తగూడెం నుండి శాసనసభ్యునిగా ఎంపికయ్యారు. ఓటమి పాలయిన తుమ్మలను పార్టీలోకి ఆహ్వనించి ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఒకేవరలో రెండుకత్తులు ఇముడుతాయా అని ఆశ్శర్యం వెళ్ళబుచ్చిన రాజకీయపండితుల అంచనాలను తలకిందులు చేస్తూ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇద్దరు కలిసి పనిచేసారు. వీరికి తోడుగా జలగం ప్రసాదరావు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో ఇద్దరు ఓటమిపాలవడం జలగం, తుమ్మల వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరిగి తుమ్మలకు మంత్రి పదవి దక్కుతుందని తుమ్మల వర్గీయులు, ఒకదఫా ఆ ప్రయోగం విఫలం అయినందున వెంకట్రావుకు మంత్రి పదవి దక్కుతుందని జలగం వర్గీయులు నమ్మకంతో ఉన్నారు. ఓటమిపాలయిన వారికి కేబినెట్‌లో స్థానం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడంతో జలగం, తుమ్మల వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖమ్మం నుండి గెలుపొందిన పువ్వాడ అమాత్యపదవిపై ఆశలు పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్ నేతగా పువ్వాడ నాగేశ్వరావు జిల్లా రాజకీయాలకు సుపరిచితులు కావడం తండ్రి నుండి రాజకీయ ఓనమాలు దిద్దుకుని గతంలో కాంగ్రెస్‌నుండి, ఇటీవల ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ నుండి రెండవ దఫా శాసనసభ్యునిగా ఎంపికైన పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల, జలగంలను కాదని పువ్వాడకే మంత్రి పదవి కట్టబెడితే ఐదు దశాబ్దాల జలగం తుమ్మల శకం ముగిసినట్లేనని రాజకీయ విశే్లషకలు అభిప్రాయపడుతున్నారు.

పార్టీల పోస్టుమార్టం
* కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ప్రచారం
* ఖండించిన కాంగ్రెస్ నేతలు
* రాష్టవ్య్రాప్తంగా ఖమ్మంపైనే చర్చ
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 14: ఎన్నికల్లో గెలుపోటములపై అన్ని రాజకీయ పార్టీలు పోస్టుమార్టం ప్రారంభించాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణంగా ఓడిపోయిన టీఆర్‌ఎస్ నేతలు అందుకు గల కారణాలను విశే్లషిస్తున్నారు. పలుచోట్ల గెలుస్తామనే ధీమా ఉన్నప్పటికీ నాయకుల మధ్య సమన్వయ లోపం, పార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకంగా చేయడం వల్లే ఓడిపోయారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో పోస్టుమార్టం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు ఉండగా ఆరుచోట్ల కాంగ్రెస్, రెండుచోట్ల టీడీపీ, ఒకచోట టీఆర్‌ఎస్, ఒకచోట స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. టిఆర్‌ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న పాలేరు స్థానంలో ఓటమిని ఇంకా ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమే అయినా పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తుమ్మల లాంటి నేత ఓటమి పాలవ్వడం ఆ పార్టీ నేతలను మరింత కుంగతీస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఓడిపోవడానికి ప్రయత్నించిన నేతలను పార్టీ నుంచి పంపేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఒకరిద్దరు పెద్దనేతలు కూడా ఉన్నారని తెలుస్తున్నది. ఇదే క్రమంలో ఐదు దశాబ్దాల కాలంలో జలగం, తుమ్మల కుటుంబీకులు లేకుండా రాజకీయాలు లేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంత్రి మండలిలో వీరిద్దరికే ప్రాధాన్యతనిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ దారుణంగా ఓడిపోవడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో జిల్లాలో గెలిచిన పలువురు శాసన సభ్యులు టిఆర్‌ఎస్ బాట పట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వైరా నియోజకవర్గంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములునాయక్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను కలిశారు. ఇదే వరుసలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలేరు కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతుండగా తాము పార్టీ మారే ప్రశే్న లేదని, కొందరు టిఆర్‌ఎస్ నేతలు కావాలని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని సదరు శాసన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, తాము చెప్పకుండా తామే చెప్పినట్లుగా ప్రచారం చేయడం దారుణమన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న రెండు స్థానాలు ఖమ్మం జిల్లాలోనే ఉండటం, ఆ స్థానాల శాసన సభ్యులు కూడా కొన్ని రాజకీయ పరమైన కారణాలతో టిఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో రాష్టవ్య్రాప్తంగా ఖమ్మం జిల్లాపైనే సుదీర్ఘచర్చ జరుగుతుండటం విశేషం.

సహకార పోరుకు సన్నద్ధం
* సహకారశాఖ షెడ్యూల్ విడుదల
* 74 సంఘాలలో 1.65లక్షల ఓటర్లు
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 14: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే వరుస ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పంచాయతీ ఎన్నికలను జనవరి 10లోపు నిర్వహించాలని సర్కార్ భావించగా అదే తరుణంలో ఫిబ్రవరిలోపు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(్ఫ్యక్స్)కు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు(డిసిసిబి)ల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే సాధ్యమైనంత వరకు ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2013లో ఫిబ్రవరిలో సహకార సంఘాలకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించారు. ఆనాటి పాలక వర్గాల ఐదేండ్ల పదివీకాలం గత ఫిబ్రవరి మొదటి వారంలో ముగిసింది. సహకార చట్టం ప్రకారం పాత పాలక వర్గాలనే పర్సన్ ఇంచార్జిగా(పీఐసీ)గా నియమిస్తూ ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ సహకారశాఖ ఆదేశాలు జారీచేసింది. ఆ గడువుకాస్తా ఆగస్టులో ముగియగానే మరో 6 నెలల పాటు పొడిగించింది. ఈ గడువు వచ్చే ఫిబ్రవరి మొదటివారంలో ముగియనుంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సహకారశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 76 ప్రాథమిక సహకార పరపతి సంఘాలున్నాయి. వీటిలో 74 సంఘాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఉండగా ఒకటి ఆంద్రాబ్యాంకు మరొకటి ఎఎస్పీఐ పరిధిలో ఉన్నాయి. ఈ సంఘాల పరిధిలో 1,65,369మంది ఓటర్లు ఉన్నారు. సహకార సంఘాల ఎన్నికలకు ఈ ఏడాది నూతన విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఓటర్ల జాబితాలో ఓటరు పేరుతో సహా ఓటరు ఫొటోను ముద్రించనున్నారు. ఈ జాబితా సహకార చట్టం నియమనిబంధలకు లోబడి ఉంటుంది. 2017 మార్చి 31నుండి 2018 మార్చి 31లోపు ఓటరుగా నమోదై సంవత్సరకాలం పూర్తయినవారికే సభ్యత్వం ఇవ్వనున్నారు. సభ్యత్వ వాటాధనంగా 300 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేయదలచినవారు సహకార సంఘంలో, బ్యాంకులలో డిఫాల్టర్ అయి ఉండరాదు. పాలకవర్గంలో సహకార చట్టాల్లో శిక్ష పడి ఉండకూడదు. ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో జిల్లా సహకారశాఖ అధికారి ఝంకీలాల్ సిబ్బందితో శాఖాపరమైన అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సహకారశాఖ విడుదలచేసిన షెడ్యూల్‌ను వెల్లడించారు. ఈ నెల 14నుండి 20వ తేది వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల ఆహ్వానం, 21న అభ్యంతరాల పరిశీలన, 22న ఓటర్ల తుదిజాబితా విడుదల చేయనున్నారు. ఈ జాబితాను 23వ తేదిన సహకార రిజిష్ట్రార్ అనుమతికి పంపుతారు. 24 నుండి 27వ తేది వరకు తుది జాబితాపై అభ్యంతరాలను రిజిష్ట్రార్ స్వీకరిస్తారు. 28న సహకారశాఖ రిజిష్ట్రార్ ఓటరు జాబితాకు అనుమతిస్తారు. 30వ తేదిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.