ఖమ్మం

ముంచిన పెథాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను గజగజలాడించింది. అనేక నష్టాలను తీసుకువచ్చిన పెథాయ్‌తో ఉష్ణోగ్రతలు కూడా అత్యల్పానికి పడిపోవడంతో చలితో ప్రజలు వణికిపోయారు. గత రెండురోజులుగా పెథాయ్ కారణంగా జల్లులు కురుస్తుండటం, వాతావరణం పూర్తిగా చల్లబడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరి, మిరప, మినుము రైతులు ఈ తుఫాన్ ధాటికి విలవిలలాడిపోయారు. వరి కల్లాల్లోకి నీరొచ్చి చేరడంతో ధాన్యం తడిచిపోయింది. దీంతో ధాన్యంలో తేమశాతం పెరుగుతుండటంతో దానిని కొనేవారు ఉండరేమోనని, ఉన్నా తక్కువ ధరకు కొంటారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు 15వేల హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. దుమ్ముగూడెం, చర్ల, కల్లూరు, బూర్గంపాడు, టేకులపల్లి, వేంసూరు, చింతకాని, మధిర, ఎర్రుపాలెం, వైరా, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, జూలూరుపాడు, ఏన్కూరు, చండ్రుగొండ, పెనుబల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పంటనష్టం అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మిర్చి కల్లాల్లోకి నీరొచ్చి కొన్నిచోట్ల మిరపకాయి తడిచిపోగా మరికొన్ని చోట్ల మిరప తోటలోకి భారీగా నీరు చేరడంతో రోగాలు వస్తాయని రైతులు భావిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో మినుము పూర్తిగా తడిచిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది.
ఇదిలా ఉండగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనల బాట పట్టారు. ముదిగొండ మండలం గోకినేపల్లి రైతులు తడిచిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. ఏన్కూరు మండలంలో తడిచిన ధాన్యాన్ని సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలని ఆందోళన చేశారు. ఇదే విధమైన డిమాండ్ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. మరోవైపు చలిగాలుల తీవ్రతకు అశ్వారావుపేట మండలంలో యాభై పశువులు మృతిచెందాయి. అనేక చోట్ల పశువులకు రోగాలు రావడంతో రైతులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. మరోవైపు వృద్ధులు, వివిధ రకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారు తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఉబ్బసం వ్యాధితో ఇప్పటికే ఆసుపత్రులకు చేరుకోగా మరికొంత మంది అస్వస్థతకు లోనయ్యారు. మరో రెండురోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అధికారులు దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దీంతో మండలాల వారీగా ఉన్నతాధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలను కూడా గ్రామాలకు పంపిస్తున్నారు.

మాజీ ఎంపీ జలగం మృతి

ఖమ్మం, డిసెంబర్ 18: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు జలగం కొండల్‌రావు మంగళవారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌లో మరణించారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు సోదరుడైన కొండల్‌రావు 1957లో వేంసూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తరువాత 1977,1980లలో ఖమ్మం ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్టస్థ్రాయిలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నేతగా పేరున్న ఆయన దాదాపు మూడు దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. సోదరుడు వెంగళరావు కంటే ముందుగానే ఆయన శాసన సభ్యునిగా ఎన్నిక కావడం విశేషం. 1960వ దశకంలోనే జీపులో అన్ని ప్రాంతాలను ఆయన తిరిగేవారు. ఆ సమయంలో ఆయనకు మాత్రమే ఆ వాహనం ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా కొండల్‌రావు మృతిపట్ల ఖమ్మం జిల్లాలోని జలగం అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆయన మృతి తమను కలచివేసిందని కొందరు సీనియరర్ నాయకులు వెల్లడించగా అనేక మంది సంతాపం వెల్లబుచ్చారు.