ఖమ్మం

జమలాపురం ఆలయంలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, డిసెంబర్ 18: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసారు. ఈ ఉత్తర ద్వార దర్శనంనకు భక్తులు తెల్లవారు జాముననే అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారు. మంగళవారం వేకువ జాముననే స్వామి వారికి పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తుల ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి ఆలయ వెనుక భాగంలోప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ముందుగా స్వామివారి మాలలు వేసుకొని 41 రోజులు దీక్ష పూర్తిచేసి, ఇరుముడులు కట్టుకొని వచ్చిన గోవింద స్వాములకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ఇరుముడులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమంలో వేసి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండ ఎర్రుపాలెం యసై వి సురేష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.