ఖమ్మం

ఏకగ్రీవ పంచాయతీల కోసం నేతల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 16: పంచాయితీ సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపికచేసేందుకు రాజకీయ పార్టీల నాయకులు భేదాభిప్రాయాలను మాని పడరాని పాట్లు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలలో తమ అభ్యర్థులను ఏకగ్రీవంగా చేయాలనే లక్ష్యంతో పావులుకదుపుతూ దూసుకుపోతున్నారు. మొదటివిడత పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణ నాటికి జిల్లావ్యాప్తంగా 22 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా రెండవవిడత నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగుస్తుండడంతో ఏకగ్రీవ ఎన్నికల కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికలకు ప్రభుత్వం ఇచ్చే రూ 10లక్షల ప్రోత్సాహంతో పాటు అభ్యర్థులు సైతం తమను ఏకగ్రీవంగా ఎన్నికచేసే పంచాయితీ అభివృద్ధికి రూ 5లక్షల వరకు నజరానాలు ఇవ్వడంతో పాటు రాజకీయ పార్టీల నేతలకు ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నాలు భారీగా సాగుతున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీలు ఒక్కోమండలంలో ఒక్కోరకంగా ఎన్నికల పొత్తులు కదుర్చుకొని బరిలో నిలుస్తున్నాయి. ప్రజాకూటమిగా ఏర్పడి శాసనసభ ఎన్నికలలో పోటీచేసిన నేతలు ఇప్పుడు పొత్తులను విస్మరించి అవసరాలను బట్టి అధికార పార్టీతో సైతం అవగాహన కుదుర్చుకొని కొత్తతరహా రాజకీయాలకు తెరలేపుతున్నారు. రెండవవిడత పంచాయితీ ఉపసంహరణ నాటికి 50గ్రామపంచాయితీలు ఏకగ్రీవం అయ్యేవిధంగా మండల, గ్రామస్థాయి నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గ్రామాలలో పార్టీలు, కులాల వారీగా వార్డుమెంబర్ల ఎంపిక చేయడంలో నాయకులు కీలకపాత్ర పోషిస్తూ ఎన్నికల ఖర్చును అధిగమించేందుకు పోటీపడుతున్న అభ్యర్థులకే నజరానా ఇచ్చే విధంగా ప్రయత్నాలను సాగిస్తున్నారు. ప్రధానంగా అధికశాతం గ్రామపంచాయితీల్లో ఇరువురు అభ్యర్థులే ఎన్నికల బరిలో నిలుస్తుండడంతో ఒక అభ్యర్థిని ఎదోరకంగా ప్రలోభాలకు గురిచేసి ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్థాయిలోనే చర్చలు సాగిస్తూ ఎంపికలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో తండాలను పంచాయితీలుగా చేయడంతో ఒక్కోగ్రామపంచాయతీలో వెయ్యికి మించి ఓట్లు లేకపోవడం, కొన్ని పంచాయతీల్లో గిరిజన ఓటర్లు కొద్దిమంది మాత్రమే ఉండడం వలన పోటీ లేకుండా చేసేవిధంగా చర్యలు చేపడుతున్నారు. గురువారంతో రెండవ విడత పంచాయితీల నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో గ్రామాలలో సంక్రాంతి పర్వదినం రోజుసైతం రాజకీయ చర్చ వేదికలు కొనసాగుతున్నాయి. కొన్నిగ్రామాలలో పోటీచేసే అభ్యర్థులు అధికంగా ఉండడంతో ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక నాయకులకు తలనొప్పిగా మారింది. ఆర్థిక వనరులు ఉన్న అభ్యర్థులనే ఎన్నికల బరిలో నిలిపే విధంగా నాయకులు పావులు కదులుపుతుండడంతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కులాల వారీగా ఓట్లను రాబట్టుకునేందుకు నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏదేమైనా అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరణ చేసుకుంటే ఏకగ్రీవలు అధికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి.