ఖమ్మం

నేడు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 16: శాసన సభ్యునిగా ఎన్నికై నెలరోజులు దాటిన తరువాత నేడు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గత నెల 11వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరిగిన అనంతరం గెలిచిన అభ్యర్థులను ప్రకటించి ధృవపత్రాన్ని అందించారు. దాదాపు 36రోజుల తరువాత నాడు ఎన్నికైన సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీలో గురువారం జరగనున్న ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన శాసన సభ్యులంతా హాజరవుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో ఫలితాలు రావడం సంచలనం కలిగించింది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న టిఆర్‌ఎస్ ఖమ్మం జిల్లాలో 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. దీంతో ఖమ్మం జిల్లా ఒక్కసారిగా చరిత్ర సృష్టించినట్లయింది. ఇదిలా ఉండగా కొత్త శాసన సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మరో విషయంలో కూడా చరిత్ర సృష్టించింది. ఈ శాసన సభలో అతిపెద్ద వయస్కుడిగా కొత్తగూడానికి చెందిన కాంగ్రెస్ శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు(73) ఇల్లెందులో గెలిచిన బాణోత్ హరిప్రియ(29) అతి చిన్న వయస్కురాలిగా అడుగు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా శాసన సభ్యుల్లో పాలేరులో గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి, వైరాలో గెలిచిన లావుడ్యా రాములునాయక్, అశ్వారావుపేటలో విజయం సాధించిన మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో గెలిచిన బాణోత్ హరిప్రియలు తొలిసారి శాసన సభలో అడుగు పెడుతున్నారు. ఈ నలుగురిలో మెచ్చా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కాగా కందాల, హరిప్రియలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించగా రాములునాయక్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఖమ్మంలో రెండవసారి గెలుపొందిన టిఆర్‌ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లిలో మూడవసారి గెలిచిన టిడిపి నేత సండ్ర వెంకటవీరయ్య, మధిరలో మూడవసారి విజయం సాధించిన కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్కలు కూడా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరి ప్రమాణస్వీకారాన్ని చూసేందుకు వారి కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు కూడా హైదరాబాద్ తరలి వెళ్తున్నారు. అసెంబ్లీలోకి వెళ్ళేందుకు అందరికి అనుమతి లభించదని, అందుకే ప్రమాణస్వీకారం పూర్తయిన తరువాత బయటకు రాగానే తమ నేతకు అభినందనలు తెలిపేందుకు హైదరాబాద్ వెళ్తున్నట్లు కొందరు నేతలు పేర్కొన్నారు.