ఖమ్మం

రైతులకు విశ్వాసం కలిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జనవరి 19: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక పథకాలను అమలు చేస్తూ అభివృద్ధికి పాటుపడుతోందని జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. శనివారం జడ్పి కార్యాలయంలో నిర్వహించిన స్థాయిసంఘ సమావేశాల్లో ఆమె అధ్యక్షోపన్యాసం చేశారు. అనంతరం పలుశాఖల అధికారులు తమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని నివేదించారు. వ్యవసాయ శాఖాధికారులు నివేదికను సమర్పించగా కోఆప్షన్ సభ్యులు జియాఉద్దీన్ మాట్లాడుతూ రైతులకు విశ్వాసం కలిగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యులు కోరం పూర్తికానందున రెండో స్థాయి సంఘ సమావేశాన్ని వాయిదా వేశారు. వ్యవసాయాధికారులు తమ నివేదికను సమయంలో సభ్యులు జియాఉద్దీన్ మాట్లాడుతూ ఎన్ని దఫాలుగా సమావేశాలు నిర్వహించినప్పటికీ చర్చించిన అంశాలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఫిషరిస్ శాఖ సభ్యులకు మేలుకలిగే విధంగా చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చే విధంగా వ్యవహరించడంపై అధికారులను ప్రశ్నించారు. మార్కెట్‌లో మిర్చి అమ్ముకునేందుకు ఈనాం పద్దతిని ఎందుకు అమలు చేయడంలేదన్నారు. మరొ కోఆప్షన్ సభ్యులు వౌలాన మాట్లాడుతూ గొల్లగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలకు బిటిరోడ్డు నిర్మించాలని, పాఠశాలల సమీపంలో కావాల్సినంత స్థలం ఉందని గిరిజన విద్యార్థుల కోసం జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. మొత్తంమీద సమావేశాలు నామమాత్రంగా జరిగాయి. గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ఈ సమావేశాలు నిర్వహించడంతో సభ్యులు హాజరుకాలేదు. పలుశాఖల పనితీరుపై అధికారులు తమ నివేదికలను సమర్పించారు.