ఖమ్మం

సమర్థత, క్రమశిక్షణ వల్లే భట్టికి సీఎల్పీ పదవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జనవరి 19: సమర్థత, క్రమశిక్షణతో పార్టీని ముందుకు నడపటంతోమంచి ప్రతిభ కనబరచిన నాయకునిగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కను పార్టీ అధిష్టానం గుర్తించడం వల్లనే ఆయనకు అత్యున్నత పదవి దక్కిందని మాజీ ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పోట్ల నాగేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నేతలు సోమ్లానాయక్ అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిఎల్పీ నేతగా భట్టివిక్రమార్కను నియమించడం పట్ల వారు హర్షం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అసెంబ్లీలో డిప్యూటి స్పీకర్ హోదాలో భట్టి ఉన్నారని, ఆ సమయంలోనే ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని ఆమోదించిన ఘనత ఆయనదేనన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలు కూడా ప్రజాకూటమి అభ్యర్థులు విజయం సాధించడంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు. పార్టీని ముందుకు నడిపించడంలో మంచి సమర్థత గల నాయకుడిగా రాజకీయ క్రమశిక్షణతో వ్యూహరచన చేయడంలో దిట్టన్నారు. రాష్ట్ర మొత్తంమీద టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ఖమ్మం జిల్లాలో 8స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో అధిష్టానం ఆయనను గుర్తించి సిఎల్పీనేతగా నియమించిందన్నారు. పిసిసి కార్యనిర్వాహక సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమై ఎమ్మెల్సీగా, వరుసగా మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల పక్షాన నిలచి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడారన్నారు. సిఎల్పీ నేతగా ఆయనకు అవకాశం దక్కడంపట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందోత్సవాల్లో మునిగిపోయారన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, వడ్డెబోయిన నర్సింహారావు, తాజుధ్దీన్, ఫజల్, బండి మణి, బాలగంగాధర్ తిలక్, పంతంగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి
* సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం(ఖిల్లా), జనవరి 19: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పోలీస్‌కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. శనివారం ముదిగొండ మండలం కమలాపురం, పెద్దమండవ, వల్లభి, నేలకొండపల్లి, చెరువుమాధారం గ్రామాలలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత, రాజకీయ గొడవలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామాలాభివృద్ధి బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. పరస్పర దూషణలకు దిగడం, ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, అల్లర్లకు పాల్పడే విధంగా ప్రోత్సహించడం లాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. స్నేహపూర్వక సానుకూల వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకొనే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అకారణంగా గొడవలకు దిగితే ఏళ్ళతరబడి కోర్టులకు తిరగాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండ ముందస్తు చర్యల్లో భాగంగా వివాదస్పదమైన, నేరచరిత్ర ఉన్న వ్యక్తులు, బెల్ట్‌షాపుల నిర్వహకులపై 109, 110 సిఆర్‌పిసి కింద కేసులు నమోదుచేసి తహశీల్ధార్ల వద్ద బైండోవర్ చేస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో పార్టీలకు అతీతంగా గెలుపుఓటములను సమానంగా తీసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐపిఎస్ ట్రైనీ అధికారి డాక్టర్ వినీత్, ఎస్‌బిఎసిపి సత్యనారాయణ, ఖమ్మం రూరల్ ఎసిపి రమోజిరమేష్, సిఐలు తిరుపతిరెడ్డి, రమేష్, మురళీ, ఎస్‌ఐలు మహేశ్, గౌతమ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.