ఖమ్మం

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 23: బ్రిటీష్ పాలన నుండి భారత్‌ను విముక్తి చేసేందుకు నిర్వహించిన స్వాతంత్య్ర ఉద్యమంలో అలుపెరిగిన పోరాటం చేసిన నేతాజి సుభాష్‌చంద్రబోస్ మహనీయుడని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి పురస్కరించుకొని పౌరసమితి కమిటీ ఆధ్వర్యంలో నగరమేయర్ పాపాలాల్‌తో కలసి బుధవారం స్థానిక త్రీటౌన్ ప్రాంతంలోని బోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేతాజి సుభాష్ చంద్రబోస్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో చురుకైన పాత్ర పోషించి రాజీలేని పోరాటం చేశారన్నారు. నేతాజి చూపిన మార్గంలో యువతి పయనించాలన్నారు. ఆయన ఆశయాల సాధమే నిజమైన నివాళులన్నారు. జయంతి సంధర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరడిప్యూటి మేయర్ బత్తుల మురళీ, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ, పౌరసమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ముత్యుంజయ్ గుప్తా, తెల్లపల్లి వెంకటసుబ్బారావు, తన్నీరు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

కార్యాలయాలను సందర్శించిన జిల్లాకలెక్టర్
తిరుమలాయపాలెం, జనవరి 23: స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను జిల్లాకలక్టర్ అర్‌వి కర్ణన్ బుధవారం సందర్శించారు. ఈ ఆసుపత్రిని ఇటీవల నిర్మించారు. ఈ ఆసుపత్రిలోని ల్యాబర్‌రూంను, టీకాలు వేసే గదిని, ఆసుపత్రి వైద్యుని గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రి వైద్యులు రామారావును ఎంతమంది రోగులు ప్రతిరోజు వస్తున్నారు, రోగులకు సరిపడ మందులు ఉన్నాయా, ఎవైన సౌకర్యాలు కావాలా, ఆసుపత్రి సిబ్బంది అవసరమా అని అడగితెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు పెరగాలని, ప్రభుత్వాసుపత్రికి రోగులు అధికంగా వచ్చేవిధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించారు. బ్యాంక్‌మేనేజర్ దుర్గాదేవిన పలు ప్రశ్నలు అడిగారు. బ్యాంక్‌లో డిపాజిట్‌లు ఏలా ఉన్నాయి, లోనింగ్ ఎలా కొనసాగుతుంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

జనన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి
ఖమ్మం(మామిళ్ళగూడెం), జనవరి 23: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో జరుగుతున్న జనన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా పొందుపర్చాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కళావతిబాయి అన్నారు. ఆసుపత్రులలో జరిగే ప్రసవాలు, జననాలు జనవరి 1 నుండి ఇబర్త్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదుచేస్తున్నామని అన్ని ఆసుపత్రులకు సంబందించిన ఐడి పాస్‌వర్డులు ఇచ్చామని పేర్కొన్నారు. దీని ద్వారా బర్త్ సర్ట్ఫికెట్ వెంటనే పొందవచ్చని, తల్లిబిడ్డకు సంబందించిన వైద్యసేవలు అందించుటకు వీలు కలుగుతుందని తెలిపారు. ఆన్‌లైన్ నమోదు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెలలో ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులలో 491ప్రసవాలు, 61 సాదారణ ప్రసవాలు, సి సెక్షన్ ఆపరేషన్ ద్వారా 430ప్రసవాలు జరిగాయని వాటిలో మగ పిల్లలు 269మంది, ఆడపిల్లలు 232మంది జన్మించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో 579 ప్రసవాలు జరగగా వీటిలో 157 సాదారణ ప్రసవాలు, సి సెక్షన్ ఆపరేషన్ ద్వారా 418ప్రసవాలు జరిగాయని వీటిలో 304మంది మగపిల్లలు, 278మంది ఆడపిల్లలు జన్మించారని తెలిపారు.