ఖమ్మం

కోటి రూపాయలిచ్చినా సాగు భూములివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, ఫిబ్రవరి 13: ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణాలకు ఎకరాకు కోటి రుపాయలిచ్చినా తమ సాగుభూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని 6 మండలాల రైతులు తేల్చి చెప్పారు. బుధవారం మండలపరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైర మండలాలకు చెందిన రైతులు సమావేశమై భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా జెఏసీ నాయకులు మేడా గోపాలకృష్ణ మాట్లాడుతూ భూములు లాక్కోవటానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. రోడ్డు నిర్మాణాలకు భూములు లాక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని 95 శాతం మంది రైతులు తమ సాగుభూమి ఇచ్చేందుకు నిరాకరించి ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదులు సమర్పించారన్నారు. రైతులు భూములివ్వటానికి వ్యతిరేఖంగా ఫిర్యాదులు సమర్పించినప్పటికిని లాక్కోవటానికి ప్రయత్నించటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 10 మండలాల పరిధిలో ప్రతి గ్రామంలో రైతులు సంబంధిత అధికారులు సర్వే చేయకుండా ఉండేందుకు కాపలా కాస్తున్నారని అన్నారు. సర్వేలకు వచ్చిన అధికారులతో పంట భూములు లాక్కోవద్దని బతిమాలి సామరస్యంగా మాట్లాడి వెనక్కు పంపాలని అంతే కాని గోడవలకు తావివ్వరాదని ఆయా మండలాలకు చెందిన రైతులకు వివరించారు. ప్రతి రైతు సైనికుడిలా పనిచేసి సర్వే చేయటానికి వచ్చిన వారిని వెనక్కు పంపి జెఏసీ నాయకులకు సమాచారమివ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన రైతు నాయకులు హరినాథ్ బాబు, పురుషోత్తం, వల్లభనేని రవికుమార్, వెంకట్రావ్, చీకటి మోహన్‌రావు, పుల్లారెడ్డి, కొండల్‌తో పాటు వందలాది మంది రైతులు పాల్గొన్నారు.