ఖమ్మం

కార్పెంటర్ల పొట్ట కొట్టే విధానాన్ని మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఫిబ్రవరి 13: కార్పెంటర్ల పొట్ట కొట్టే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని జిల్లా సామిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ధ్యానేశ్వరరావుడిమాండ్ చేశారు. కలప ఆధారిత పరిశ్రమలపై పోలీసులు, ఫారెస్టు అధికారులు జరుపుతున్న దాడులను నిలిపివేయాలని లేనిపక్షంలో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం సామిల్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 11 నుండి 13 వరకు జిల్లా వ్యాప్తంగా కార్పెంటర్లు, కార్పెంటర్ల అసోసియేషన్, సామిల్స్ అసోసియేషన్స్ బంద్ పాటించామని తెలిపారు. ప్రభుత్వం విడుదలచేసిన జిఓ 55ను వెంటనే రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విదేశాలనుండి దిగుమతి చేసుకున్న కలపపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపట్ల నిరసన వ్యక్తంచేశారు. వాల్టా చట్టంలో ఆన్‌లైన్ అనుమతులను రద్దుచేసి శాఖాపరమైన అనుమతులు ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అడవుల్లో అక్రమాలపై పోలీసుల జోక్యం ఉండాలేతప్పా, సామిల్స్, టింబర్‌డిపోలు, కార్పెంటర్ దుకాణాలపై జోక్యం లేకుండా చేయాలన్నారు. కలప ఆధారిత పరిశ్రమల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునేవారిపై అనవసరమైన దాడులను నిలిపివేయాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ సింగ్ (సత్తుబయ్), ప్రధానకార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, కార్పెంటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జలేంద్రచారి, విరాచారి, గోవిందాచారి, నాయకులు మీర్జా సాధిక్, కంచర్ల వెంకటరమణ, ఈశ్వరప్రసాద్, ఎస్‌కె రహమాన్ తదితరులు పాల్గొనగా కార్పెంటర్ల నిరసనకు ఏఐటియుసి జిల్లా నాయకులు కంచర్ల జమలయ్య, గుత్తుల సత్యనారాయణ సంఘీభావం తెలిపారు.