ఖమ్మం

జడ్పీ చైర్మన్‌గా బరపటి బాధ్యతల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 13: ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా బరపటి వాసుదేవరావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న గడిపల్లి కవిత రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఉన్న బరపటి వాసుదేవరావును చైర్మన్‌గా నియమిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెలలో పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో చైర్మన్‌గా వైస్ చైర్మన్‌నే నియమించినట్లు తెలుస్తోంది. కాగా పాల్వంచ జడ్పీటిసిగా ఉన్న బరపటి బుధవారం ఉదయం బాధ్యతలు తీసుకోగానే మాజీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డిప్యూటీ సిఇఓ శిరీష, జిల్లా పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీంద్రప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బరపటి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్న విషయాన్ని గమనించాలన్నారు. తన పదవీకాలం తక్కువ ఉన్నదని అనేక మంది అంటున్నారని, అయినప్పటికీ ప్రజాసేవ చేసేందుకు ఆ సమయం చాలన్నారు. ఇదిలా ఉండగా బరపటిని అభినందించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన జడ్పీటిసిలు, ఎంపిపిలు, ఉన్నతాధికారులు జిల్లా పరిషత్ ప్రాంగణానికి చేరుకున్నారు. వారందరిని ఆప్యాయంగా పలకరించిన ఆయన ఉద్యోగులను మాత్రం పాలనలో సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, తన విధులకు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వ్యవస్థలను నాశనం చేస్తున్న పాలకులు
* నాలుగు స్థానాల్లో పోటీకి కసరత్తు * సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని

ఖమ్మం, ఫిబ్రవరి 13: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ వ్యవస్థలను నాశనం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గిరిప్రసాద్ భవన్‌లో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన నాటి రాజుల పాలనను గుర్తు చేస్తున్నదన్నారు. మంత్రివర్గం లేకుండా పూర్వకాలంలో రాజు, మంత్రి పరిపాలించేవారని, ప్రభుత్వం ఏర్పడి రెండునెలలైనా ముఖ్యమంత్రి, హోంమంత్రి మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ యజ్ఞాలు, యాగాలు, వాస్తులంటూ ప్రజలను మభ్యపెడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నిరంకుశ భావాలు కలిగిన కెసిఆర్ నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తూ తన మాటలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ల సమావేశంలో మొక్కలు నాటకపోయినా నాటిన మొక్కలు ఎండిపోయినా డిస్మిస్ చేస్తానని ప్రకటించడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అవినీతికి హద్దే లేదని, తమ పార్టీ నేతలు ఇతర పార్టీలోకి వెళితే వేటు వేస్తున్న కెసిఆర్ ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఆయన వైఖరిని తెలియజేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌కు మరో అవకాశం ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. రాఫెల్ కుంభకోణానికి బాధ్యుడైన మోడీ అందులోంచి బయటపడేందుకు కక్షపూరిత వ్యవహారాలను నడుపుతున్నారన్నారు. తన స్థాయిని ప్రధాన మంత్రి నుంచి గల్లీ స్థాయికి దిగి వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని ఆరోపించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల నుంచి సిపిఐ పోటీ చేయాలని స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చిందని, అందుకు అనుగుణంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెల 25వ తేదీన ఖమ్మం పార్లమెంటు పరిధిలో కార్యకర్తలతో సమావేశం కూడా ఏర్పాటు చేశామని, పొత్తులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సురేష్, నాయకులు నర్సింహరావు, క్లైమెంట్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పోచారానికి తుమ్మల పరామర్శ

ఖమ్మం, ఫిబ్రవరి 13: శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా నేతలతో కలిసి బుధవారం పరామర్శించారు. ఇటీవల పోచారం మాతృమూర్తి మరణించిన నేపథ్యంలో నిజామాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్ళిన తుమ్మల నాగేశ్వరరావు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ నడిచింది. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులు ఉన్నారు.