ఖమ్మం

మీ త్యాగం.. మేము మరువం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఫిబ్రవరి 18: ‘అమరులారా వందనం.. మీకిదే నీరాజనం.. మీ త్యాగం మేము మరువం.. ఓ వీర సైనికులారా.. అందుకోండి మా జోహార్లు’ అంటూ భద్రాద్రివాసులు శోకతప్త హృదయాలతో నివాళులర్పించారు. ముష్కరుల దాడిలో అమరులైన సైనికులను స్మరించుకుంటూ, ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ చిన్నా, పెద్దా కలిసి భద్రాచలంలో సోమవారం భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. సైనికుల ధైర్యసాహసాలను కొనియాడుతూ నినాదాలు చేశారు. ఉగ్రవాదం నశించాలంటూ నినదించారు. భారత సైనిక దళాలకు సంఘీభావంగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు, పోలీసులు, పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు, సుమారు 4వేల మంది విద్యార్థులు ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు భారత్‌మాతాకీ జై.. జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. భద్రాచలంలో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, స్వచ్చంధ సంస్థలు, సిటిజన్ ఫోరం, సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. స్థానిక మారుతీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ డిగ్రీ కళాశాల, ఎల్‌ఐసీ రోడ్డు, మసీదు రోడ్డు, యూబీ రోడ్డు, అంబేద్కర్‌సెంటర్, బీఈడీ కళాశాల వరకు సాగింది. డిగ్రీ కళాశాల మూలమలుపు, అంబేద్కర్ సెంటర్‌లో వేలాదిమంది విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంఘీభావం తెలిపారు. అంబేద్కర్‌సెంటర్‌లో మానవహారం సందర్భంగా ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ మనోజ్‌కుమార్, అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్‌కుమార్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎంవీఐ వెంకటపుల్లయ్యలు మాట్లాడారు. పూల్వామాలో ఉగ్రవాదుల దాడి దేశ ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన జవాన్లకు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. పోలీసు, సీఆర్‌పీఎఫ్ బలగాలు నిరంతరం దేశ రక్షణ, ప్రజాసేవలో నిమగ్నమై ఉంటాయన్నారు. ఉగ్రవాదులు భారత సైనికులను ఎదుర్కొనే సత్తా లేక దొంగదెబ్బ తీశారని అన్నారు. అమరజవాన్లకు సంతాప సూచికంగా ర్యాలీ నిర్వహించిన స్వచ్చంధ సంస్థలు, విద్యాసంస్థలను అభినందించారు. అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్‌ఎల్ కాంతారావు, తాళ్ళూరి పంచాక్షరయ్య, తిప్పన సిద్దులు, ఎన్‌సీహెచ్ చక్రవర్తి, గట్టు వెంకటాచార్యలు మాట్లాడుతూ సైనికుల త్యాగాలు వృథాగా పోవని, పాకిస్థాన్‌కు భారత్ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. ఇటువంటి పిరికిపంద చర్యలకు భారత ప్రజలు భయపడరన్నారు. భారత ప్రజలు దేశం కోసం సైన్యాన్ని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పట్టణంలోని క్రాంతి విద్యాలయం, ఏపీఆర్‌జేసీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెయింట్‌పాల్స్, వెంకట్ విద్యాలయం, బీఈడీ కళాశాల, మదర్‌థెరిస్సా కళాశాల, లిటిల్‌ఫ్లవర్స్ విద్యాసంస్థలు, రామ్స్ డిగ్రీ కళాశాల, సారపాక ఆచార్య స్కూల్, ప్రగతి విద్యానికేతన్‌లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భద్రయ్య, డాక్టర్ వి.జయభారతి, డాక్టర్ జీవీవీ సుదర్శన్‌రావు, సిటీకేబుల్ సత్యనారాయణ, అబ్రహాం, మాగంటి బుజ్జి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ సాయన్న, కామేశ్వరరావు, జీఎస్ శంకర్‌రావు, భూపతిరావు, నాగభూషణరావు, అల్లం నాగేశ్వరరావు, బొలిశెట్టి రంగారావు, బోగాల శ్రీనివాసరెడ్డి, బ్రహ్మారెడ్డి, జి.మాధవరెడ్డి, ఎం.రాంబాబు, కిశోర్, సూర్యనారాయణ, ప్రసాద్, రాజారెడ్డి తదితరులు పాల్గొని ఉగ్రదాడులు గర్హనీయమని పేర్కొన్నారు.