ఖమ్మం

గుండె నొప్పిపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), ఫిబ్రవరి 18: అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పితో ప్రాణప్రాయ స్థితిలోకి వెళ్ళే వ్యక్తిని కాపాడే ప్రతి వ్యక్తి ప్రాణదాతేనని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. సోమవారం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండె పునర్జీవంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పోలీస్ కమీషనర్ కార్యాలయ ఆవరణంలోని శ్రీకృష్ణప్రసాద్ మెమోరియల్ పోలీస్ హెల్ఫేర్ పాఠశాలలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండె నొప్పి వచ్చినప్పుడు ఏ విధమైన ప్రాథమిక శికిత్స నిర్వహించాలనే అంశంపై డాక్టర్ కెయు భాస్కర్, రమేష్, ట్రైనర్ కోటేశ్వరావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్‌తో పాటు ఆయన సతీమణి స్కూల్ చైర్ పర్సన్ జెబా ఖానమ్, అడిషనల్ డిసిపిలు దాసరి మురళీధర్, శ్యాంసుందర్, ట్రైనీ ఐపియస్ అధికారి వినీత్, తానా సభ్యులు పాల్గొన్నారు.
సైనిక కుటుంబానికి రూ 20లక్షలు ఆర్ధిక సహాయం అందించాలి
కొత్తగూడెం రూరల్, ఫిబ్రవరి 18: పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 20లక్షలు ఆర్ధిక సహాయం అందించాలని తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు గుండపనేని సతీష్ కోరారు. సోమవారం బస్టాండ్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను భారతజాతి ఎన్నటికీ మరచిపోదని అన్నారు. జై జవాన్, జై కిసాన్ అని నిత్యం స్మరించే భారత దేశంలో సైనికుల త్యాగాల వల్లనే 125కోట్ల భారతీయులు కంటి నిండా నిత్ర పోతున్నారని తెలిపారు. రాజకీయాలు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా విద్యార్ధుల నుంచి ఉద్యోగుల వరకు, కార్మికుల నుంచి కర్షకుల వరకు ప్రతి ఒక్కరూ ఉగ్రవాదుల దుశ్వచర్యలను ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైనికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేసి దేశాభిమానాన్ని చాటుకోవాలని అన్నారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగకుండా కేంద్రం పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆన్నారు. మృతి చెందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టివిపిఎస్ నాయకులు ఖాదర్‌బాబా, జగ్గుదాస్, బాబు, దుర్గారావు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు
* సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా
కొత్తగూడెం రూరల్, ఫిబ్రవరి 18: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని పెద్దబజార్‌లో సోమవారం జరిగిన హమాలీ కార్మికుల జనరల్‌బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలీచాలని వేతనాలతో బతుకు సాగిస్తున్న హమాలీ కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అరోపించారు. హమాలీల కోసం భవన నిర్మాణ కార్మికుల తరహాలో సమగ్ర సంక్షేమ చట్టం రూపొందించాలని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ పాలక ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని అన్నారు. అసంఘటిత కార్మికులకు చట్టబద్దంగా అమలు కావాల్సిన హక్కులను కాలరాస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. హమాలీ కార్మికుళలు ఎఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించే పోరాట కార్యక్రమాల్లో భాగస్వాములై సమగ్ర సంక్షేమ చట్టం, చట్టబద్ద హక్కులను సాధించుకోవాలని అన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో రెక్కల కష్టంపై బతుకుతున్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరీ చేయాలని, శ్రమకు తగిన వేతనం అందించాలని, పిఎఫ్, వైద్యం, పింఛను, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రధాన సెంటర్లో హమాలీలకు రెస్ట్ షెల్టర్లు నిర్మించాలని, ప్రస్తుత నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా యాజమాన్యాలు కూలీ రేట్లు పెంచాలని, కార్మికులకు పని భద్రత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం నాయకులు పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, తరాల రాజు, తరాల లక్ష్మయ్య, నీలం మొగిలి, సారయ్య, కంచర్ల సమ్మయ్య, మర్చంట్ ఆసోసియేషన్ నాయకులు జపోపియా తదితరులు పాల్గొన్నారు.