ఖమ్మం

భూ సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 18: భూ సమస్యలను పరిష్కరించాలని జిల్లాకు చెందిన అనేక మంది బాదితులు జిల్లా జాయింట్ కలెక్టర్ అయోషా మస్రత్‌ఖానంకు మొరపెట్టుకున్నారు. సోమవారం స్థానికి జడ్పి సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో భూ సమస్యలతో పాటు అనేక సమస్యలపై బాదితులు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి సంబందిత అధికారులను సత్వరమే పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన తనకు 1.10ఎకరాల పొలం ఉందని దానికి సంబందించిన పాస్‌పుస్తకాలు ఇంతవరకు రాలేదని తనకు పాస్‌పుస్తకం ఇప్పించాలని రైతు ముద్రబోయిన కోటమ్మ జెసికి విన్నవించారు. పెనుబల్లి మండలం కలకొడిమ గ్రామానికి చెందిన కొలకపోగు చిన్నపుల్లయ్య అనే రైతు తనకు 2.3ఎకరాల పొలం ఉందని తనకు ఇంతవరకు పాస్‌పుస్తకం ఇవ్వలేదని తనకు వెంటనే పాస్‌బుక్ ఇప్పించాలని విన్నవించారు. వైరా మండలం ముసరమడుగు గ్రామ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 582లో 0.21కుంటలు, 584లో 1.28ఎకరాల భూమి 578ఖాతాలో ఉందని ఇదే 578ఖాతాలో వెక్కిరాల చిన్న వెంకటేశ్వర్లకు 0.30కుంటల భూమి ఉందని దీనిని మార్చే విషయంలో తనకు చెందిన భూమి తనఖాతాలో లేకుండ పోయిందని తనకు న్యాయం చేసి తన భూమి తన ఖాతాలో ఎక్కించాలని కంభంపాటి సత్యవతి మొరపెట్టుకున్నారు. పాలేరు గ్రామానికి చెందిన వెంకన్న తాను వికలాంగుడినని తన జీవనోపాధికోసం రుణం మంజూరు చేయాలని కోరారు. మధిర మండలం జాలిముడి గ్రామ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 21/అలో 1.30ఎకరాల భూమిని 2014లో కరకట్ట నిర్మించేందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఇంతవరకు ఆ భూమికి సంబందించిన నష్ట పరిహారం అందలేదని విఆర్వో తనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అతనిపై చర్య తీసుకొని తనకు నష్టపరిహారం అందజేయాలని రైతు దేవరపు కృష్ణమూర్తి విన్నవించారు. రైతు బజార్‌కు చెందిన హవల్దార్ రిశే్లష్ అమరులైన సైనిక కుటుంబాలకు 1,162రూపాయల చెక్కును జెసికి అందజేశారు.