ఖమ్మం

పస్తులుంటున్న పారిశుద్ధ్య కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 20: ఖమ్మం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సక్రమంగా వేతనాలు అందక వారి కుటుంబాలు పస్తులుంటున్నారని, వారికి వేతనాలు వెంటనే చెల్లించాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బిజి క్లైమెంట్, శింగు నర్సింహరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కార్పొరేషన్ కమిషనర్ జె శ్రీనివాసరావును కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పాలకసంస్థ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడంలో నగరపాలక వర్గం ఘోరంగా విఫలమైందన్నారు. అసలే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు సక్రమంగా అందకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసర వస్తువులు, ఆనారోగ్య సమస్యల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఇప్పటికైన కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆరోగ్య రక్షణ పరికరాలైన గ్లౌజులు, మాస్కులు, చెప్పులు, నూనెలతో పాటు యూనిఫాం అందించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వినతిపత్రం అందించిన వారిలో మున్సిపల్ స్ట్ఫా అండ్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) జిల్లా ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, నాయకులు గాదె లక్ష్మినారాయణ, బి పాపారావు, జి శ్రీనివాస్, కందుల మహేశ్ తదితరులు ఉన్నారు.

కూలి డబ్బులకోసం సెల్‌టవర్ ఎక్కిన మహిళలు
మధిర, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాహారం పథకం కోసం అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన నర్సరీలలో పనిచేసిన కూలీలు డబ్బులు ఇవ్వాలని సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకొంది. సిరిపురం గ్రామానికి చెందిన కంటిపుడి సునీత, వేల్పుల మరియమ్మ, కనకపుడి తిరుపతమ్మ, మేరితో పాటు మరో 11మంది మహిళా కూలీలు 2015సంవత్సరంలో అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన నర్సరీలలో కూలీ పనులు చేశారు. వీరికి ఒక్కొక్కరికి 5వేలు చొప్పున 15మందికి 75వేల రూపాయలు కూలీ డబ్బులను అప్పటి నుండి చెల్లించలేదు. నాలగు సంవత్సరాలైనా కూలీ డబ్బులు ఇవ్వలేదని గత నెల రోజులుగా మధిరలోని అటవీ శాఖాధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో కూలీలు సెల్‌టవర్ ఎక్కి తమకు రావాల్సిన కూలీ డబ్బులు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మధిర టౌన్ ఎస్‌ఐ చంద్రమోహన్ సంఘట స్థలానికి చేరుకొని కూలీ డబ్బులు ఇప్పించేలా అధికారులతో మాట్లాడతానని సర్థిచెప్పటంతో ఆందోళనకారులు సెల్‌టవర్ దిగారు. 4సంవత్సరాల క్రితం కూలీలతో పనిచేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం పట్ల వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.