ఖమ్మం

అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన జిల్లా కాంగ్రెస్ వర్గ విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 20: జిల్లా కాంగ్రెస్ పార్టీలోని విభేదాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. దశాళ్దాల కాలంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతలు వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం, ఆరోపణలు చేసుకోవటం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్టీలో ఇమడలేమనే భావనతో కొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు తమకు నేతగా ఉన్న కాంగ్రెస్ నాయకునికి కూడా తెలియజేసినట్లు సమాచారం. నేతల మధ్య విభేదాలే తాము పార్టీ మారేందుకు కారణంగా వారు చెప్పుకొస్తున్నారు.
కాగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మల్లు భట్టివిక్రమార్క అనుచరులుగా పేరున్న పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షునిగా జావేద్‌ను నియమిస్తూ పిసిసి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణుకాచౌదరి డిసిసి నియామకంలో తనను సంప్రదించలేదని బహిరంగంగానే ప్రకటించారు. అంతే కాకుండా ఆ పార్టీకి చెందిన కొంత మంది సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలు తమకు సమాచారం ఇవ్వటం లేదని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సలీం అహ్మద్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు జిల్లాలో పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి విడివిడిగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో రేణుకాచౌదరి నిర్వహించిన సమావేశానికి జిల్లా నుండి అనేక మంది ఆమె అనుచరులు హాజరయ్యారు. ఆమెకు వ్యతిరేకంగా మరి కొంత మంది ఖమ్మంలో సమావేశం అయినట్లు తెలిసింది. కాంగ్రెస్ శాసనసభపక్ష నేతగా ఉన్న మల్లు భట్టివిక్రమార్క జిల్లాలో అందరూ నేతలను సమన్వయ పరిచి పార్టీని మరింత అభివృద్ధి పరచాలని, కానీ ఆయన తన వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆయన వైరా నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో ఇవి బహిర్గతమయ్యాయి. వీటన్నింటిని ఆధారాలుగా చూపిస్తూ కొందరు నేతలు ఎఐసిసి ప్రతినిధులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ప్రస్తుత పరిస్థితులలో పార్టీలో ఇమడలేమని భావిస్తూ పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను గుర్తించిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే వైరా, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాలకు చెందిన ప్రధాన నేతలు ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం. మార్చి మొదటి వారంలోగా కాంగ్రెస్ నుండి తమ పార్టీలో చేరేవారు చేరుతారని టిఆర్‌ఎస్ నేత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేతలు దీనిపై దృష్టి సారించి నాయకుల మధ్య విబేధాలు పరిష్కరించి అందరిని ఒక తాటిపైకి తీసుకురాకపోతే మార్చి మొదటి వారంలో పార్టీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది.