ఖమ్మం

కేజీవీబీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి, ఫిబ్రవరి 20: బాలికల విద్యతోనే అక్షరాస్యత సాధ్యం అన్న ఉద్దేశ్యంతో నిర్మించిన కస్తూర్బా బాలికల విద్యాలయాలు సత్ఫలితాలందిస్తునప్పటికి అందులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు చాలీచాలని జీతాలు ఇస్తున్న కారణంగా దీనికి నిరసనగా 23న టిఎస్‌యుటిఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాను విజయవంతం చెయ్యాలని జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ సుభాషిణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కస్తూర్భా విద్యాలయంలో ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన జీతం చెల్లించాలన్న నిబంధనను పక్కన బెట్టి, కనీస వేతనాలు చెల్లించాలని కోర్టు తీర్పును పట్టించుకోవడంలేదన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలలో రెండవ శనివారం అధికారికంగా సెలవు ఉన్నప్పటికి కెజిబివి, యుఆర్‌ఎస్ పాఠశాలలో సెలవు అమలు కావడం లేదన్నారు. ఉపాధ్యాయులకు, సిబ్బందికి వేసవి కాలం సెలవులకు జీతం ఇవ్వనందున 12నెలల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యాలయాలలో పనిచేసే సిబ్బందంతా మహిళలైనందున వారికి మెటర్నిటి, చైల్డ్‌కేర్ సెలవులు ఇవ్వాలని కోరారు. చాలీచాలని జీతాలు, సెలవులు లేక అధిక ఒత్తిడికి గురై అనేక మంది మహిళా ఉపాధ్యాయులు మృతి చెందారన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. విద్యాలయాల్లోపని చేసే అందరికి హెల్త్‌కార్డులు ఇచ్చి ఉపాధ్యాయుల ఆరోగ్యానికి , జీవితానికి భద్రత ఇవ్వాలని కోరుతూ ఈ నెల 23న హైదరాబాద్‌లోజరిగే మహధర్నాను జయప్రదం చెయ్యాలని కోరుతున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి ఎం నర్సయ్య, మండల కార్యదర్శులు లక్ష్మినారాయణ, రాజకుమారి విద్యాలయ ఎస్‌ఒ అజిత కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

కేజీవీబీ, యూఆర్‌ఎస్ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలి
కొణిజర్ల, ఫిబ్రవరి 20: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంతోపాటు ఆర్బన్ రెసిడెన్సియల్ స్కూల్స్‌లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యూటిఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్ మాట్లాడుతూ దేశంలో మహిళలు అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో బాలికల్లో అక్షరాస్య పెంపొందించటానికి ఏర్పాటు చేసిన కేజిబివి పాఠశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నప్పటికీ వాటిలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది మాత్రం చాలి, చాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీమ్ కోర్టు తీర్పు వెలువరించినప్పటికీ ప్రభుత్వం అమలు చేయటం లేదన్నారు. మిగతా పాఠశాలల మాదిరిగా కేజిబివి, యూఆర్‌ఎస్ పాఠశాలలకు నెలలో రెండవ శనివారం సెలవు ఇవ్వాలని, ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. సర్వీస్ రెగ్యూలర్ చేయాలని, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, సర్వీస్ రిజిష్టర్ ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, కేజిబివి సిబ్బంది పాల్గొన్నారు.

కేజీవీబీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి
చింతకాని, ఫిబ్రవరి 20: ప్రభుత్వం కేజీవీబీ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని టిఎస్‌యుటిఎఫ్ చింతకాని మండల అధ్యక్షుడు మీరా హుస్సేన్ డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని లచ్చగూడెం కెజిబివి ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎజిబివి, అర్బన్ రెసిడెన్సియల్ పాఠశాలల్లో బోధన, బోధనేతర ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాదర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సహాదర్నాను ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఇ మహేశ్వర్, వెంకన్న, వై రమాదేవి, కెజిబివి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.