ఖమ్మం

భక్తులకు సౌకర్యాల కల్పనే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 9: భక్తులకు మంచి సౌకర్యాలను కల్పించడమే ధ్యేయమని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు భక్త్భివంతో సీతారాముల కల్యాణం, పట్ట్భాషేక మహోత్సవం తిలకించేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. రూ.కోటి వ్యయంతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సెక్టార్లలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సెక్టార్‌లో జిల్లాస్థాయి అధికారితో పాటు మంచినీరు, మజ్జిగ, ఫ్యాన్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పారిశుద్ధ్యం కూడా రౌండ్ ది క్లాక్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు ఎవరు తీసుకొస్తారు అని విలేఖర్లు ప్రశ్నించగా దీనిపై ప్రస్తుతానికైతే ఎటువంటి స్పష్టత రాలేదని కమిషనర్ పేర్కొన్నారు.
ఆకస్మాత్తుగా తనిఖీలు..
నవమి ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్ మెరుపు తనిఖీ చేశారు. దేవస్థానం ఈఓ తాళ్ళూరి రమేష్‌బాబు, డీఈ రవీందర్‌లతో కలిసి ఆయన ముందుగా ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రసాదాలు, తలంబ్రాల విషయంలో రాజీ పడవద్దని, అన్నీ సరిపడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు సిద్ధంగా ఉంచాలన్నారు. కల్యాణ మండపంలోకి వెళ్లి సామాన్య భక్తులకు కల్యాణం వీక్షించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారని ఈఓ, డీఈలను ప్రశ్నించారు. స్టేడియం పైభాగాన ఉన్న సెక్టార్‌లో కమిషనర్ కింద కూర్చుని మండపంలో కల్యాణ దర్శనం తిలకించారు. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. మండపం చుట్టూ ప్రత్యేక భద్రత ఉంచాలన్నారు. భక్తులకు వైద్యశిబిరాలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని మంచినీరు పుష్కలంగా అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా కల్యాణ తలంబ్రాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా కౌంటర్లను పరిశీలించారు. తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి భక్తులు సేదతీరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గోదావరి ఒడ్డున ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులు నెలకొల్పాలన్నారు. భక్తులకు ఎక్కువ టిక్కెట్లు లభించేలా చూడాలన్నారు. అన్నదాన సత్రంలో తనిఖీలు నిర్వహించి భక్తులకు అందుతున్న భోజన సదుపాయాలు పరిశీలించారు. ఉత్సవాల రోజుల్లో రుచికరమైన, నాణ్యమైన భోజనం భక్తులకు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భద్రాద్రిలో జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులు మది నిండా మధురానుభూతులు నింపుకొని వెళ్లేలా మన ఏర్పాటు ఉండాలని ఈఓను ఆదేశించారు. భక్తులు అసౌకర్యానికి గురైతే మనం చేసిన ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరేనని కమిషనర్ పేర్కొన్నారు.