ఖమ్మం

అధికార పార్టీకి అధికారుల వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 9: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, తమ సంబంధీకులు ఉంటున్న హోటల్ గదులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అధికార టిఆర్‌ఎస్‌కు చెందిన నేతలు బాహాటంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కొన్నిచోట్ల పోలీసులే వారికి సహకరిస్తూ అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి దీనిపై ఫిర్యాదులు చేస్తామన్నారు. గతంలో కౌంటింగ్‌కంటే ముందే ఇవిఎంలను తెరవడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై ఫిర్యాదు చేయడంతో ఆయనను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సహకరిస్తుందని, కానీ తమను ఇబ్బందులకు గురిచేస్తూ ఇతరులకు వత్తాసు పలికితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలు తమకు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నా వారిని కూడా కొనిచోట్ల భయపెడుతున్నట్లు సమాచారం వస్తున్నదని, వారికి తాము అండగా ఉంటామన్నారు. తమను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము భయపడేవాళ్ళము కాదనే విషయాన్ని గమనించాలని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వడ్డెబోయిన నర్సింహరావు, మానుకొండ రాధాకిషోర్, ఏకె రామారావు, తిలక్, దీపక్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి మూడు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు
గార్ల, ఏప్రిల్ 9: అంబేద్కర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకొని గార్ల మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈనెల 11,12,13తేదీలలో ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల స్థాయి కబాడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేతగాని నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం గార్లలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాల స్థాయి కబాడ్డీ పోటీలతో పాటు 12వతేదీన విద్యార్థులకు మండల స్థాయి వ్యాసరచన, 13న మహిళలకు మండల స్థాయి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాపోటీల్లో పాల్గొని విజయం సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందిస్తామని, పోటీల్లో పాల్గొన గోరే క్రీడాకారులు తమ ఎంట్రీలను అందించాలని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ అధ్యక్షుడు బొడ్డు నర్సింహారావు, నిర్వాహణ కమిటీ సభ్యులు జింజ్యాల యాదగిరి, జువ్వాజి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీని ఓడించే సత్తా కమ్యూనిస్టులకే ఉంది
* ప్రధానిపై కాకుండా రాహుల్ పోటీ కేరళలోనా..? * సీపీఎం అభ్యర్థి బి వెంకట్
ఖమ్మం(కల్చరల్), ఏప్రిల్ 9: దేశంలో మతతత్వ బీజేపిని గద్దెదించే శక్తి కేవలం కమ్యూనిస్టులకే ఉందని ఖమ్మం పార్లమెంట్ సిపిఐ బలపర్చిన సిపిఎం అభ్యర్థి బోడా వెంకట్ పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బీజేపీతో యుద్ధం చేయకుండానే చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పోటీ చేయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కేరళలో పోటీ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార ఘట్టమైన చివరిరోజు మంగళవారం ఖమ్మం సుందరయ్య భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తామని బిజెపి నేతలు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. భవిష్యత్‌లో అక్కడి ప్రజల రిజర్వేషన్లు, రాయితీలను రద్దు చేసే ప్రమాదం ఉందన్నారు. దేశంలో పరిశ్రమలను వృద్ధిచేయడం అంటే ప్రధానికి కేవలం అంబానీలు, ఆదానీలే కనిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయి కేవలం డబ్బు రాజకీయాలపైనే ఆధారపడిందన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఊహించని దెబ్బ తగలడం ఖాయమన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీని, రాష్ట్రంలో కెసిఆర్‌ను చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికల నిర్వాహణ క్రమంలో పోలీసుల తీరు ప్రజలకు అసహ్య భావన కల్గిస్తుందన్నారు.
తాజా ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖపోరు నెలకొంటుందని బి వెంకట్ పేర్కొన్నారు. ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు పోటా పోటీగా సిపిఎం ఉభయ కమ్యూనిస్టుల అభ్యర్థినైన తాను నిలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 20 రోజులుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు. సిపిఐ బలపర్చడం సిపిఎంకు ప్రధానంగా అనుకూలించే అంశం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు బాగం హేమంతరావు, నున్నా నాగేశ్వరరావు ఇరుపార్టీల నాయకులు సాబీర్‌పాషా, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.