ఖమ్మం

యోగాతో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూన్ 19: యోగాతో సమస్థ రోగాలకు పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి లక్ష్మణ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, నగరమేయర్ డాక్టర్ పాపాలాల్‌లు పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయూష్ ఆధ్యర్యంలో నిర్వహించిన యోగా వాక్‌ర్యాలీని బుధవారం జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక మానవుని జీవన సైలి ఉరుకులు, పరుగులతో ముడిపడి ఉందన్నారు. మానసిక వత్తిడికి లోనవుత్తున్నారని వాటిని బయటపడేందుకు యోగా చేయడం ఉత్తమమైన మార్గమన్నారు. నిత్యం యోగా చేయడం వల్ల ప్రతి మనిషిలోనూ మానసిక, శారీరిక, సమతూల్యత అలవడుతుందన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుండి వృద్ధుల వరకు యోగా చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.