ఖమ్మం

భూసమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ గ్రామసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, జూన్ 19: ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూసమస్యలను పరిష్కరించేందుకే క్షేత్ర స్థాయిలో రెవిన్యూ గ్రామసభలను నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ అన్నారు. మండల పరిధిలోని బేతాళపాడు గ్రామాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించి అక్కడ జరుగుతున్న రెవిన్యూ గ్రామసభకు హాజరయ్యారు. ముందుగా స్థానికంగా ఉన్న భూసమస్యలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యను పరిష్కరించటంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందలేక పోవటం, తరాల నుంచి జీవనాధారంగా ఉన్న భూములపై హక్కు లేని విషయాలను పలువురు రైతులు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవిన్యూ, అటవీ, ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు 1990 వరకు కాస్తులో ఉన్న వారికి నిబంధనల ప్రకారం పట్టాలు అందజేయాలని తెలిపారు. భూసమస్యల పరిష్కారం విషయంలో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. స్వచ్ఛ్భారత్ మిషన్ కింద మండలంలో ఇంకా 1600 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రతి రోజు 40 నిర్మాణాల పూర్తిజరిగే విధంగా కృషి చేయాలని అన్నారు. లక్ష్య సాధన కోసం భాగంగా పీఆర్ ఈఈ సుధాకర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించటంతోపాటు మండలంలోని 13 గ్రామ పంచాయతీలకు ఒక్కో మండలాధికారిని నియమించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారులు తగు విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో తహశీల్దారు చిట్టోజు రమేష్, ఎంపీడీవో పుల్లూరు జగదీశ్వర్‌రావు, మండల ఇంజనీరు శివలాల్, ఏపీవో జమీర్‌పాషా, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ వీరభద్రం, సీసీ బండ్ల మధుసూధన్‌రావు, వర్క్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.