ఖమ్మం

సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పినపాక, జూన్ 19: భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తూ హల్‌చల్ చేసినట్లు పోలీసులకు సమాచారం రావడంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. సరిహద్దునున్న ఏడూళ్లబయ్యారం, కరకగూడెం, మంగపేట, ఏటూర్‌నాగారం, గుండాల అటవీ ప్రాంతాలను పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. అణువణువునా గాలిస్తూ మావోలు సంచరించే రహదారులను మూసి వేశారు. అనుమానం వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. చెంతనే ఉన్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుంచి గత వారం రోజుల క్రితం హరిభూషణ్, దామోదర్, లచ్ఛన్న, రీనా, రాజిరెడ్డి, వెంకన్న, భద్రు, మంగు సారధ్యంలో 30 నుండి 40 మంది మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లో వచ్చినట్లు ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రంగంలోదిగారు. చాలా కాలం తర్వాత మావోలు రాకను పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని అడవిని జల్లెడపడుతున్నారు. దీంతో సరిహద్దు నున్న గ్రామాల్లో అలజడి రేగుతోంది. దశాబ్దకాలంగా ప్రశాంతంగా వున్న గిరిజన గ్రామాలు వీరి రాకతో ఆందోళనతో ఉన్నారు. పోలీసులు, మావోల సంచారంతో ఎప్పుడు ఏ ప్రమాదం చవిచూడాల్సి వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజుకొక యుగంలా గడుపుతున్నారు. ఏజెన్సీలో నివాసం ఉంటున్న అధికార పార్టీ నాయకులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీసు ఆదేశాలు జారీచేశారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, అమాయక గిరిజనులను రెచ్చగొడుతూ తిరిగే మావోల మాటలను నమ్మవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. దీంతోగ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.