ఖమ్మం

మార్కెట్‌లో వెయిమెంట్ ఇంటిగ్రేషన్ ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జూన్ 19: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో అమలు చేస్తున్న వెయిమెంట్ ఇంటిగ్రేషన్‌పై సమస్యలు ఎదురైనా ఈ విధానం ఆగదని మార్కెటింగ్‌శాఖ అడిషనల్ డైరక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్‌లో అమలు చేస్తున్న వెయిమెంట్ ఇంటిగ్రేషన్ వల్ల కలుగుతున్న సమస్యలను ఖమ్మం మార్కెట్‌లోని కమిషన్‌దారులు, వ్యాపారులు, ఖరీదుదారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్‌శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌లలో వెయిమెంట్ ఇంటిగ్రేషన్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా ఈ విధానం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయినప్పటికి ఈ విధానం ముందుగా ప్రధాన మార్కెట్‌లలో రెగ్యూలర్ చేసిన తరువాత అన్ని మార్కెట్‌లలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధానం వల్ల రైతులకు, వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రధానంగా రైతులు ఈ విధానంతో అధికంగా లబ్ధి జరుగుతుందన్నారు. మార్కెట్‌లో జరిగే ప్రతి ఒక్క దానిని ఆన్‌లైన్ చేయటం వల్ల మార్కెట్‌లో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఉంటుందన్నారు. కాగా వెయిమెంట్ ఇంటిగ్రేషన్ విధానాన్ని మిర్చి బస్తాలకు కూడా అమలు చేయటంపై వర్తక సంఘం ఆధ్వర్యంలో సమస్యలను వెలుబుచ్చారు. వీటిలో ప్రధానంగా మిర్చి తుకాలు ఎలక్ట్రానిక్ కాటాలలో తుకాలు 250,500,750,1కెజిగా ఉండాలని, మూతి పట్టాలు ఉన్నచో 500గ్రాములు తీసివేత ఉండాలని, పెద్ద బోరంకు 1కేజి అధనంగా తీసివేయాలని, చిన్న బోరంకు 500గ్రాములు అధనంగా తీసివేయాలని, జాయింట్ సంచిలో 500గ్రాముల అలవెన్స్ తీయాలని, మూతి పట్టా కూడా ఉంటే 1కేజి అలవెన్స్ తీసివేయాలని, సార సంచి ఉండి 50కేజిలు ఉంటే డబుల్ తారం 1కేజి అలవెన్స్ తీసివేయాలని, 60కేజిలు దాటితే 2కేజిలు అలవెన్స్ తీసివేయాలని, సరకు తేడా ఉన్నట్లయితే ఖరీదు దారు అట్టి సరుకును తిరస్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కాగా ఖరీదుదారులు కోరిన విధంగా అమలు చేయలేమని దీనిపై ఖమ్మం మార్కెట్ ఇన్‌చార్జ్ అయిన జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అప్పటివరకు వెయిమెంట్ ఇంటిగ్రేషన్ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొంత మంది వారి స్వర్ధం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటి డైరక్టర్ ఆఫ్ మార్కెటింగ్ రాజు, ఖమ్మం మార్కెట్ డిఎంవో సంతోష్‌కుమార్, మార్కెట్ గ్రేడ్-2 అధికారి బజార్, సూపర్‌వైజర్లు ఆంజనేయులు, నిరంజన్, సిబ్బంది. వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు.