ఖమ్మం

బేతుపల్లి చెరువునకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఆగస్టు 12 : కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్దచెరువుకు నీరు పూర్తిస్థాయికి చేరింది. చెరువు నీటిమట్టం 16 అడుగులకు చేరుకొని నిండుకుండలా మారింది. అరఅడుగుపైన అలుగుపారుతూ తమ్మిలేరు వాగు ద్వారా నీళ్ళు పారుతున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు ఆనందంతో ఉప్పొంగుతున్నారు. చెరువుకు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవటంతో సోమవారం ఎంపీపీ దొడ్డా హైమావతి, జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావులు ఆయకట్టు పొలాలకు తూము ద్వారా సాగునీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఐబి డీఈఈ మరియన్న, ఏఈ వెంకటేశ్వరరావు, బేతుపల్లి సర్పంచ్ పాకలపాటి శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ యాగంటి శ్రీనివాసరావు, దొడ్డా శంకర్‌రావు, బాల్ద వెంకటేశ్వరరావు, వల్లభనేని పవన్ తదితరులు పాల్గొన్నారు.