ఖమ్మం

కూలీబంధు పథకాన్ని అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), ఆగస్టు 12: రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు కూలీబంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక మహిళా కూలీ సంఘం కన్వీనర్ బొప్పన పద్మ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సుందరయ్యభవన్‌లో గద్దల రత్తమ్మ, వాసం వెంకటరమణ అధ్యక్షతన మహిళా కూలీల జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా వచ్చిన పద్మ మాట్లాడుతూ మహిళలు ఇంటా బయట తమ సమయాన్ని కేటాయించి పనులు చేస్తున్నా వారికి సమానపనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. మహిళలు శ్రమదోపిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు కనీస కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, కనీస వేతన చట్టాన్ని సవరించాలని అనేక రకాలుగా పోరాడుతున్నా పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. కూలీలందరికి కూలీబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని, అలాగే ప్రతి కుటుంబానికి డబుల్‌బెడ్రూం ఇల్లు, 3 ఎకరాల భూమి మంజూరి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యా, వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలన్నారు. రేషన్‌షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలన్నారు. మహిళా హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలకు, హత్యలకు, హింసకు గురౌతున్నారని తెలిపారు. వారి రక్షణకు పాలకులు సరైన కఠిన చర్యలు అమలు చేయడంలేదని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ఖజానా నిండడం కోసం పాలకులు మత్తు పానీయాల అమ్మకాలపై ఆధారపడుతున్నారని, పాలకుల అసమర్ధ పాలనతోనే మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆమె విమర్శించారు. ఐద్వా జాతీయ నాయకురాలు బత్తుల హైమావతి మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రాకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. సమాజ అభివృద్ధికి పునాదిగా ఉన్న మహిళలను రక్షించడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.