ఖమ్మం

భక్తిశ్రద్ధలతో బక్రీద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఆగస్టు 12 : ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని సోమవారం సత్తుపల్లిలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే సత్తుపల్లిలో షాదీఖానాను ఖమ్మంలో నిర్మిస్తున్న దానికంటే మిన్నగా కోటి రూపాయలతో నిర్మించేందుకు కృషిచేస్తామన్నారు. అవసరమైతే స్థలాన్ని కూడా పెంచుతామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లిం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. త్యాగానికి ప్రతీకగా, దానధర్మాలకు స్ఫూర్తిగా బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. దువ్వా అనంతరం ఈద్‌ముబారక్, ఈద్‌ముబారక్ అంటూ పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మేకలను ఖుర్భానీ చేశారు. ముస్లింలకు మాంసాన్ని పంచిపెట్టారు. అనాథలు, నిరుపేదలకు కానుకలు అందించారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ సదర్ ఎస్‌కె మోనార్క్ రఫీ, ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆదిల్‌షరీఫ్, రియాజుద్దీన్, మున్వర్ హుస్సేన్, గ్రాండ్ వౌలాలి, చాంద్‌పాషా, దిలావర్‌ఖాన్,్ఫయాజ్‌అలీ, జాన్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.