ఖమ్మం

పునర్విభజన తర్వాత నేడు ఐటీడీఏ మొదటి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఆగస్టు 12: భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పాలక మండలి సమావేశం సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు నేడు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన తర్వాత ఐటీడీఏ పాలకమండలి సమావేశాన్ని తొలిసారి నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి నిర్వహించే పాలక మండలి సమావేశానికి నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, పీఓలు హాజరయ్యే అవకాశం ఉంది. భద్రాచలం ఐటీడీఏ పరిధి నాలుగు జిల్లాలకు విస్తరించి ఉంది. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాలు భద్రాచలం ఐటీడీఏలో ఉన్నాయి. ఈసారి సమావేశానికి గిరిజన సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీలు పాల్గొననున్నారు. భౌగోళికంగా నాలుగు జిల్లాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన జరిగినప్పటికీ భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 32 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు నేటి సమావేశానికి భద్రాచలం రానున్నారు. ఈ మేరకు భద్రాచలం ఐటీడీఏ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. భద్రాచలం పీఓ గౌతమ్ ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు కూడా పంపారు.
విభజనకు ముందు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 29 మండలాలు భద్రాచలం ఐటీడీఏలో ఉండేవి. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం పేరుతో 5 మండలాలు, రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రాలో కలిశాయి. ఆ తర్వాత ఐటీడీఏ పరిధి 24 మండలాల్లోనే ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత భద్రాచలం డివిజన్‌లోని వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలో కలిశాయి. గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్‌లో కలిశాయి. కామేపల్లి, ఏన్కూరు, కారేపల్లి మండలాలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 మండలాలు మిగలగా, నూతనంగా మరో 6 మండలాలు ఏర్పడటంతో ఇవన్నీ భద్రాచలం ఐటీడీఏ పరిధిలోకే వచ్చాయి. ఇలా భద్రాచలం ఐటీడీఏ పరిధి నాలుగు జిల్లాలకు విస్తరించింది. అయితే దాదాపు మూడేళ్ల నుంచి గిరిజనుల సంక్షేమంపై సమీక్ష కరువైంది. ఈ తరుణంలో నేడు జరగనున్న పాలకమండలి సమావేశంలో చేయనున్న తీర్మానాలపై మన్యం వాసుల్లో ఆసక్తి నెలకొంది.
14 అంశాలతో అజెండా
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నాలుగు జిల్లాలకు విస్తరించగా ఇక్కడ 6.50లక్షల గిరిజన జనాభా ఉన్నారు. అయితే ప్రధానంగా 14 అంశాలను అజెండాగా పెట్టుకొని సమావేశం నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన సమావేశ తీర్మానాలు, అమలు, విద్య, సంక్షేమం, గురుకులం, వైద్యం, ఆరోగ్యశాఖ, గిరివికాసం, ఉద్యానవనం, వ్యవసాయం, ట్రైకార్, అటవీ హక్కుల చట్టం, ఇంజనీరింగ్, వనబంధు కళ్యాణయోజన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, ఎల్టీఆర్ కేసులు, జమా ఖర్చులు, పరిపాలనా విభాగం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు నివేదికలను సిద్ధం చేశారు. ఐటీడీఏ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో ఎవరు అడిగినా స్పష్టతనిచ్చేలా సమాధానం చెప్పాలని, ఆధారాలు చూపించాలని పీఓ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.