ఖమ్మం

మిషన్ కాకతీయతో తీరనున్న భూగర్భ జల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), మే 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం ఎంతో ప్రయోజనకారి అని, భూగర్భజలాలను పెంచి భవిష్యత్ తరాలకు నీటి సమస్య లేకుండా చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకానికి ప్రజల మద్దతు అవసరమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖానాపురం హవేలి పరిధిలోని 6వ డివిజన్‌లో చెరువు పూడిక పనులను పువ్వాడ మంగళవారం ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా భవిష్యత్ తరాలకు నీటి ఇబ్బంది లేకుండా చూసే అవకాశం ఉందన్నారు. ప్రజల సహకారంతోనే ఇది విజయవంతం అవుతున్నదని వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు హనుమంత్, కోటి, కర్నాటి కృష్ణ, నర్సింహరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.