ఖమ్మం

హెల్మెట్లపై అవగాహన సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), జూన్ 21: జూలై 1వ తేదీ నుంచి హెల్మట్‌లు ధరించాలని పోలీసులు అవగాహన సదస్సులు చేపట్టారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం వన్‌టౌన్ సిఐ వెంకటనర్సయ్య, ఐఎంఏ హాల్‌లో ట్రాఫిక్ సిఐ పి నరేష్‌రెడ్డి వేరువేరుగా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ద్విచక్ర వాహనదారులు, ప్రముఖులతో మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నివారించేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్‌లు తప్పనిసరిగా వాడాలని హెల్మెట్ చట్టం గురించి వివరించారు. జడ్పీ సమావేశ మందిరంలో పోలీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకి సిఐ వెంకటనర్సయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు గన్‌శ్యామ్‌వోజా తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఐఎంఏ హాల్‌లో ఆటో, లారీ, ట్రాలీ డ్రైవర్స్‌తో నిర్వహించిన సదస్సులో తెలంగాణ రోడ్ సేఫ్టీ క్లబ్ అధ్యక్షుడు గన్‌శ్యామ్‌ఓజు, ట్రాఫిక్ సిఐ నరేష్‌రెడ్డి, ఎస్‌ఐలు పృద్వీధర్‌గౌడ్, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పోడుభూముల్లో పోరు నాగళ్లు
కొత్తగూడెం రూరల్, జూన్ 21: తరతరాలుగా పోడుభూములనే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న చర్యలను ప్రతిఘటిస్తూ గిరిజన రైతులు మంగళవారం పోడుభూముల్లో పోరు నాగళ్లు కట్టి దుక్కులుదున్నారు. మండల పరిధిలోని రేగళ్ళ అటవీ ప్రాంతంలో గల సర్వే నెం 122లో సుమారు 130 ఎకరాల భూమిని గత పది సంవత్సరాలుగా గిరిజనులు సాగుచేసుకుంటున్నారు. రేగళ్ళ , రేగళ్ళతండా, బావోజీ తండా, కొత్తతండాలకు చెందిన గిరిజనులు ఈ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ అధికారులు పోడు భూములలో సేద్యం చేయకుండా ఆ భూములలో మొక్కలను పెంచేందుకు చర్యలు ప్రారంభించి పోడు భూమి చుట్టూ ట్రెంచ్ వేశారు. ఆదివారం అటవీశాఖాధికారులు ట్రాక్టర్‌తో పోడుభూమిని దున్నించి మొక్కలు వేసేందుకు సిద్దమవ్వగా పోడుసాగుదారులు ప్రతిఘటించారు. మంగళవారం సిపిఎం, వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో సుమారు 200 నాగళ్ళతో పోడుభూముల్లో నాగళ్ళతో దుక్కులు దున్ని విత్తనాలు వేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జాటోత్ కృష్ణ మాట్లాడుతూ ఎన్నోఏళ్ళుగా పోడుసాగుచేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజన భూములను అటవీశాఖాధికారులు ఆక్రమించుకోవాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల హామీలలో భాగంగా పేద, గిరిజన రైతులకు మూడుఎకరాల భూమిని ఇస్తానన్న హామీని మరిచి గిరిజనుల భూములను లాక్కునేందుకు ఫారెస్ట్ అధికారులను పంపించడం దారుణమన్నారు. పోడుభూములలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటే చర్యలను విరమించుకోవాలని కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో పోడుసాగుదారుల కోసం ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. పోడుసాగుదారులను అడ్డుకోవడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా గిరిజన మహిళలు నినాదాలు చేయడంతో అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో రేగళ్ళ ఎంపిటిసి కోబల్, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు లావూడ్యా సత్యనారాయణ, వీర్ల రమేష్, అమర్‌సింగ్, గిరిజన రైతులు పాల్గొన్నారు.