ఖమ్మం

చట్ట విరుద్ధంగా భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), జూన్ 21: రాష్ట్ర ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్ని ఉల్లంఘించి, దౌర్జన్యంగా రైతుల భూములను సేకరిస్తోందని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం స్థానిక మంచికంటి మీటింగ్ హాల్ నందు మామిళ్ళ సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 2వ దశ భూ నిర్వాసిత రైతుల జిల్లా స్ధాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు 2వ దశ కింద జిల్లాలో ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి రైతులకిచ్చే పరిహారం అన్యాయంగా ఉందన్నారు. మార్కెట్ ధర 12 నుండి 20 లక్షల వరకు ఉంటే దానికి 3 రెట్లు అదనంగా చెల్లించాల్సిన ప్రభుత్వం రైతులకు అసలు ధర కూడా ఇవ్వకుండా బలవంతంగా తీసుకోవడం దారుణమన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఒక మాట మాట్లాడి, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడడం తగదన్నారు. 2013 భూ సేకరణ చట్టం కెసిఆర్ ఎంపిగా ఉన్న సమయంలో బలపర్చాడని, ప్రస్తుతం 123వ జీవోను తేవటాన్ని ఖండించారు. కేంద్రంలో నరేంద్రమోడి, రాష్ట్రంలో కెసిఆర్‌లు కార్పొరేటుకు మద్దతునిస్తున్నారని ఆరోపించారు. అనంతరం రైతుసంఘం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ 123 జీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2013చట్టం ప్రకారం మార్కెట్ ధరకు అదనంగా 3రెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, నాయకులు సన్మతరావు, నాగేశ్వరరావు, బిక్కసాని గంగాధర్, బింగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

హామీలకు ప్రభుత్వం పాతర
గార్ల, జూన్ 21: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను టిఅర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ పాతర వేసి నియంతృత్వ విధానాలతో పాలన సాగిస్తుందని సిపిఐ జిల్లా నాయకుడు ఏపూరి బ్రహ్మం ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతు అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్ రూమ్‌లు, దళితు,గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని, బంగారు తెలంగాణ సాధనలో ప్రజలం భాగస్వామ్యం కావాలంటు పిలునిస్తున్నారే తప్ప ప్రజలకు చేస్తున్న సేవలు శూన్యమన్నారు. దశాబ్దాలుగా పోడును సాగు చేసుకొని జీవిస్తున్న గిరిజనులకు పట్టాలివ్వక పోగా హరితహారం పేరుతో మొక్కలు నాటేందుకు వారు సాగు భూములను బలవంతంగా లాక్కోవటం సహించరాని నేరమన్నారు. ఇకనైన ప్రభుత్వం తమ విధానాలకు స్వస్తి పలకకపోతే గిరిజనుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు బోళ్ళ సూర్యం, కట్టబోయిన శ్రీనివాస్, జంపాల వెంకన్న, రఘపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.