ఖమ్మం

పోడు భూముల్లో ఈ ఏడాది పంటకు ఇబ్బంది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారేపల్లి, జూన్ 23: పోడు భూముల్లో ఈ ఏడాది పంటలు పండించుకోటానికి పోడు రైతులకు ఇబ్బంది లేకుండా అటవీశాఖామంత్రితో మాట్లాడానని వైరా శాసనసభ్యులు మదన్‌లాల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఫారెస్టు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. కారేపల్లి రైతులు పోడు చేసుకుంటున్న ప్రాంతాన్ని సందర్శించారు. రైతులు సాగు చేసుకుంటున్న ప్రాంతానికి వచ్చిన ఖమ్మం డిఎఫ్‌వో సునీల్ హిరామత్, ట్రైనీ కన్జర్వేటర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్‌లతో ఆయన చర్చలు జరిపారు. అటవీశాఖ, స్థానిక రెవెన్యూ మ్యాపులను పరిశీలించిన అనంతరం రైతుల సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని అఖిలపక్ష నాయకులతో స్థానిక ఫారెస్టు కార్యాలయంలో బేటీ అయ్యారు. పోడు సాగు చేసుకుంటున్న రైతులు తాము ఎన్నో ఏళ్ళుగా పోడు సాగు చేసుకుంటున్నామని, తమకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారని ఎమ్మెల్యేకు తెలిపారు.
సమస్యకు తాత్కాలిక పరిష్కారం
ఎమ్మెల్యే డిఎఫ్‌వో, ట్రైనీ కన్జర్వేటర్లతోనూ, ఇటు అఖిలపక్ష నాయకులతోనూ మాట్లాడిన తర్వాత ఈ ఏడాది పంటలేసుకోటానికి అధికారులు ఒప్పుకున్నారు. 2005కు పూర్వం నుండి సాగుచేసుకుంటున్న, పట్టాలు కలిగి ఉన్న రైతులు ఉన్నారని చెప్తున్నందున అది తేల్చటానికి ఒక కమిటీని వేసి పరిష్కరించుకోటానికి ఫారెస్టు అధికారులు ముందుకొచ్చారు. డిసెంబర్ నెల వరకు సమయం ఇచ్చినట్లు డిఎఫ్‌వో తెలిపారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి, ఇల్లెందు జెడ్‌పిటీసీలు ఉన్నం వీరేందర్, చండ్ర అరుణ, స్థానిక తహశీల్దార్ మంగీలాల్, అఖిలపక్ష నాయకులు బొంతు రాంబాబు, భూక్యా వీరభధ్రం నాయక్, కొండెబోయిన నాగేశ్వర్ రావు, రావూరి శ్రీనివాస రావు, సర్పంచ్ మండెపుడి రాణి, కాంగ్రెస్ నాయకురాలు పగడాల మంజుల, న్యూడెమోక్రసీ నాయకులు గండి యాదగిరి, వై ప్రకాష్, జానకి, తురక నారాయఇ, తురక మల్లేష్, అనీఫ్ పాల్గొన్నారు.