ఖమ్మం

ఖమ్మం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి: ఖమ్మం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం పాలేరు డివిజన్ కార్యదర్శి పొనె్నకంటి సంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల మంచినీరు దొరకక ప్రజలు గొంతు తడుపుకోవడానికి కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని కోరారు. పేదలందరికీ ఉపాధి పనులు 200 రోజులు కల్పించాలని, కనీసం 300 రూపాయల కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని, దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బందెల వెంకయ్య అధ్యక్షత వహించగా, నండ్ర ప్రసాద్, ఆర్ వెంకటరెడ్డి, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, తాళ్ళూరి వెంకటేశ్వర్లు, లింగంపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభానికి సిద్ధమైన రైతు శిక్షణా కేంద్రం సిద్ధం

కల్లూరు, మార్చి 20: స్థానిక పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో కల్లూరు డివిజన్ కార్యాలయం వద్ద నిర్మిస్తున్న పాడి రైతుల శిక్షణా కేంద్రం, ల్యాబ్ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఆర్‌డిఎఫ్ విడుదల చేసిన రు. 65 లక్షల వ్యయంతో నిర్మించే ఈ శిక్షణా కేంద్రంలో కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, పెనుబల్లి, వెంసూరు మండలాలకు చెందిన రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదే విధంగా రు. 10లక్షల వ్యయంతో పశువ్యాధి నిర్థారణ కేంద్ర భవనాన్ని కూడా పూర్తి చేసారు. ఈ ప్రయోగశాలలో పశువులకు సంక్రమించే వ్యాధులను ప్రయోగశాలలో పరీక్షించి నిర్థారించేందుకు నియోజకవర్గ స్థాయిలో రైతులకు ఉపయోగపడుతుంది. ఈ రెండు భవనాలు ప్రారంభమైన తరువాత రైతులకు అధునాతన పశు పోషణ, పాడి పరిశ్రమ, పాల దిగుబడులు పెరిగేందుకు, పశుగ్రాసాల సాగు, మేలు రకం పశు గ్రాసాల వల్ల కలిగే లాభం వంటి అంశాలపై జీవాల పెంపకం దారులకు అవగాహన కల్గించటంతో పాటు మరణించిన పశువులకు పోస్టుమార్టమ్ నిర్వహించి ఏ వ్యాధి వల్ల మరణించిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఏడిఏహెచ్ వై భానుచౌదరి తెలిపారు. రైతు శిక్షణా కేంద్రం, ప్రయోగశాలల వల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. దీంతో పాటు మధిర, వైరాలలో మూడు పాడి రైతు శిక్షణా కేంద్రాలు, మూడు పశు వ్యాధి నిర్థారణ ప్రయోగశాలలు నిర్మాణాలు జరుగుతున్నాయని భానుచౌదరి తెలిపారు.

ప్రతి ఒక్కరికీ క్రీడలు అవసరం
వైరా, మార్చి 20: నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికీ క్రీడలు ఎంతో అవసరమని ఎఎస్పీ సాయికృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో గత కొన్ని రోజులుగా మధిర డివిజన్ స్థాయి పోలీసు, జర్నలిస్టులకు జరుగుతున్న క్రీడలు ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈక్రీడల వల్ల పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయని ఆయన అన్నారు. ఇద్దరి లక్ష్యం సమాజశ్రేయస్సేనన్నారు. అటువంటి పోలీసులకు - జర్నలిస్టులకు ఇటువంటి క్రీడలు వారి మానసిక స్థాయిని మెరుగుపరుస్థాయని అన్నారు. ఈకార్యక్రమంలో వైరా డిఎస్పీ రాంరెడ్డి, వైరా, మధిర సిఐలు చేరాలు, నూనె వెంకటేశ్వర్లు, వైరా, కొణిజర్ల, చింతకాని, ఎర్రుపాలెం, మధిర టౌన్, రూరల్, బోనకల్లు, తల్లాడ మండలాలకు చెందిన ఎస్సైలు పాల్గొన్నారు.