ఖమ్మం

చార్జీల పెంపుపై నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం పేద ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శించాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. మన తెలంగాణను మనమే పాలించుకుందామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం మరిచి ప్రజలపై భారాలు మోపడం ఎంతవరకు సమంజసమని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి కొడాలి శ్రీనివాసన్, జిల్లా కార్యదర్శి కోనేరు రాము, మండల అధ్యక్షుడు ఎస్కే అజీమ్, జెడ్పీటీసీ రవికుమార్, ఎంపీపీ శాంత ప్రశ్నించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడారు. నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, చార్జీలు పెంచేది లేదని ప్రజలకు హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల భారం ప్రజలపై మోపడం న్యాయం కాదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పెంచిన చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లా ప్రతాప్, వి.రాము, కుంజాల రాజారాం, కంభంపాటి సురేష్, అనురాధ, దేవి, చుక్కమ్మ, జ్యోతి, వెంకటేశ్వరరావు, రాము, నరేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై భారాలు మోపొద్దు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు మోపే ప్రయత్నంలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచడాన్ని సీపీఐ నాయకులు తమ్మళ్ళ వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ గేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. బంగారు తెలంగాణ పేరుకే పరిమితం అయిందని, ప్రజలపై భారాలు మోపితే పోరాటాల ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని అన్నారు. పేద ప్రజలపై భారాలు మోపడం హేయమైన చర్య అని, వెంటనే చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సునీల్‌కుమార్, సురేష్‌నాయుడు, సాయికుమార్, ఖాదర్, గుమ్మడి రాజు, లావణ్య, జయరాం, నాగు, చిట్టిబాబు, సుభాని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చార్జీల పెంపు దారుణం: కాంగ్రెస్
విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపడాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు తీవ్రంగా ఖండించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఈ సమయంలో విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం తగదని, చార్జీల పెంపుతో ప్రజలపై ప్రభుత్వం మోయలేని భారం వేసిందన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో సరెళ్ల నరేష్, నాగేశ్వరరావు, రాజు, అర్జున్, ప్రవీణ్, హన్మంతు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో...
ఖమ్మం,(మామిళ్లగూడెం):ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలపై భారం మోపే ప్రయత్నం చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారని టిడిపికి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టిడిపి జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్యలు పేర్కొన్నారు. విద్యుత్, బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ ఖమ్మం బస్టాండ్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తన కుటుంబాల ఆర్భాటం కోసం, ప్రచారల కోసం అప్పుల పాలు చేశారని ఆరోపించారు. వాటిని ప్రజల మీద రుద్దేందుకే చార్జీల పెంపు చేపట్టారని, దానిని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జీవన్‌కుమార్, శ్రీనివాసరావు, శివయ్య, వెంకట్రామయ్య, నాగేశ్వరరావు, హరీష్, గోపిసందేశ్ పాల్గొన్నారు.
న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో...
ఖమ్మం(ఖిల్లా): రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, బస్ చార్జీలను పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి నగర కార్యదర్శి కె శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర కమిటీ ఆధ్వర్యంలో పెంచిన ధరలను నిరసిస్తూ శుక్రవారం పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శన నిర్వహించి బైపాస్‌రోడ్డులో రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించమని చెబుతున్న పాలకులు విద్యుత్, బస్ చార్జీలను పెంచి పేద వర్గాలపై అధికభారం మోపారన్నారు. అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్టమ్రే ధనిక రాష్టమ్రని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వేలకోట్ల భారం ఎందుకు మోపారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తాననడం హామీలకే పరిమితమైందన్నారు. కార్పొరేట్ రంగాలకు అండగా నిలుస్తూ పేదల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని, గత పాలకులకు పట్టిన గతే పడుతుందన్నారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి ఝాన్సీ, భరత్, జగన్, సుభాన్, రామారావు, శిరీష, మోహన్‌రావు, రాజేష్, రామనాధం తదితరులు పాల్గొన్నారు.