ఖమ్మం

సోకులు పోతున్న కెసిఆర్‌కు బుద్ధి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 24: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చానని సోకులకు పోతున్న కెసిఆర్‌కు బుద్ధి చెప్పాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గారపాటి రేణుకాచౌదరి పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం వచ్చిన ఆమెను జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహం నుండి పార్టీ కార్యాలయానికి ర్యాలీగా తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ పార్టీ ఒడిదుడుకుల్లో ప్రతిసారి పార్టీని రాష్ట్రంలో ఆదుకుంది ఖమ్మం జిల్లా ప్రజలేనన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలకోసం మంజూరు చేసి కట్టించిన ఇందిరా అవాజ్‌యోజన పథకం ఇండ్ల బిల్లులే చెల్లించని కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని ప్రజలనుమోసం చేస్తున్నారన్నారు. నష్టాలుపాలై బాదలు పడుతున్న రైతులను ఆదుకోకుండా మహిళలను ఆటబొమ్మలను చేసి ఆడిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకోసం కాకుండా తన స్వలాభం కోసం, తన ఫామ్‌హౌస్‌కు నీటి కోసం మల్లన సాగర్ ప్రాజెక్టు పేరిట భూనిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని, అక్కడి ప్రజలు తిరుగబడుతున్నారని పేర్కొన్నారు. గత సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతులు పంటలు పండించలేక త్రీవంగా నష్టపోయారని, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు వర్షాలు లేవని, రైతులకు అండగా ఉంటామని చెప్పేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు, సోనియాగాంధీకి కార్యకర్తలే వారసులన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా చివరకు వాటి మనుగుడనే కోల్పోయాయని, రాష్ట్రంలో టిడిపి పని అయిపోయిందని, త్వరలో కారు నాలుగు చక్రాల గాలిపోతుందన్నారు. ఖమ్మం జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం బాటలు వేయాలన్నారు. జిల్లాలో, రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్న అధికారుల, పోలీసులకు గుణపాఠం చెప్తామన్నారు. జిల్లాలో కమ్యూనిస్టులను ఎదుర్కొని కాంగ్రెస్ నిలబడిందన్నారు. రాజకీయ భవిష్యత్ కాంగ్రెస్‌దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో హెల్ప్‌లైన్, కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా పార్టీకి సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం, ఎడవల్లి కృష్ణ, వివి అప్పారావు, దిరిశాల భద్రయ్య, కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహరావు, దీపక్‌చౌదరి, జిల్లా పార్టీ మహిళ అధ్యక్షురాలు బండి మణి తదితరులు పాల్గొన్నారు.