ఖమ్మం

అవినీతికి అడ్డుకట్టవేసిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 24: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు తీసుకున్న రెండేళ్ళలోనే అవినీతికి అడ్డుకట్టవేశారని ప్రపంచ దేశాల్లో భారతదేశం గౌరవాన్ని ఇనుమడింప చేశారని, అభివృద్ధి మంత్రంతో మోదీ నాయకత్వంలో దూసుకుపోతున్నామని కేంద్రమంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా స్పష్టం చేశారు. శుక్రవారం నగర శివారు ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నరేంద్ర మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిపై వికాస్ పర్వ్ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నడ్డా మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలో మంచి గుర్తింపు తీసుకొచ్చించి ప్రధానమంత్రి నరేంద్రమోడినేనన్నారు. ఇతర దేశాలు కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. జన్‌ధన్, సురక్ష యోజన, అటల్ పెన్షన్, ముద్ర అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. అర్హులైన వారికే న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆధార్‌కార్డును ఏర్పాటు చేశారన్నారు. రైతులకు న్యాయం చేయాలనే పంటబీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత బిజెపి ప్రభుత్వానికే దక్కిందన్నారు.
అనంతరం బిజెపి జాతీయ కార్యదర్శి, ఎంపి రామ్‌విచార్ నేతమ్ మాట్లాడుతూ రెండేళ్ళ పాలనలో జాతీయ రహదారులను ఏర్పాటుకు కృషి చేసిన ఘనత తమదేనన్నారు. ఏ ప్రభుత్వం చేపట్టనటువంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలో 18వేల గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకుంటే ఇప్పటి వరకు 8వేల గ్రామాలకు విద్యుత్ సరఫరానందించామన్నారు. అదే విధంగా మిగతా గ్రామాల్లోని సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
కమ్యూనిస్టులు సిద్ధాంతం పేరుతో రాద్ధాంతం - కోవా లక్ష్మణ్
కమ్యూనిస్టులు సిద్ధాంతం పేరుతో రాద్ధాంతం చేస్తూ ప్రజలను మాయ చేసే పనిలో నిమగ్నమయ్యారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. గత పాలకులకు పట్టిన గతే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌కు పట్టనుందని జోస్యం చెప్పారు. రాజకీయ విలువలు లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతూ ఎన్నికల హామీలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సాధనలో బిజెపి కీలకపాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో పోలీస్ లాఠీ దెబ్బలు తిన్న వారిని పక్కనపెట్టి, ఉద్యమానికి ఎదురుతిరిగిన వారిని అందలమెక్కించారని ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో బంగారు తెలంగాణ కోసం టిఆర్‌ఎస్‌లోకి చేరుతున్నామని చెప్తున్న ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని గ్రహించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ 160మంది ఎంపిలు పార్లమెంట్‌లో గళం విప్పిన వారిలో బిజెపి నేతలు కూడా ఉన్నారన్నారు. వెంకయ్యనాయుడు,సుష్మాస్వరాజ్, నడ్డా లాంటి వారు చేసిన కృషి మరువలేనిదన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కోసం పోరాడింది కూడా బిజెపినే అనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఖమ్మం ఖిల్లా కమలం ఖిల్లాగా మారేందుకు ప్రతి కార్యకర్త దోహదపడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం నిర్మాణానికి సూచనలు చేసిందన్నారు. ముఖ్యమంత్రికి ప్రశ్నించేవారు, విమర్శించే వారు లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే పరిపాలన సాగిస్తూ ప్రజలకు మాయమాటలు చెప్తున్నారని ఏద్దేవా చేశారు. మాయమాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించకపోవటం బాధాకరమన్నారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మార్తినేని ధర్మారావు, కూసంపుడి రవీందర్, చందా లింగయ్య, కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, విద్యాసాగర్, జిల్లా నేతలు రుద్రప్రదీప్, దొంగల సత్యనారాయణ, గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు.