ఖమ్మం

భారీ వర్షంతో నిండిన చెరువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, జూన్ 26: మండలంలో శని, ఆదివారాల్లో కురిసిన వర్షానికి మండలంలోని చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది. శనివారం రాత్రి 7.6సెంటీమీటర్ల వర్షపాతం మండలంలో నమోదు కాగా, మండలంలోని దాదాపు 23చెరువుల్లోకి నీరు రాగా, రైతులు ఖరీఫ్‌పై కొత్త ఆశలు పెంచుకున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే రైతులు విత్తనాలు వేసి ఉన్న తరుణంలో ఈవర్షం ఎంతగానో ఉపయోగపడిందని రైతులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వర్షం కారణంగా మిషన్ కాకతీయ పనులు నిలిచిపోయాయి. మధిర మండలంలో రెండో విడత మిషన్ కాకతీయ కింద 9చెరువులు మంజూరయ్యాయి. ఇందులో నాగవర్పాడుచెరువు పనులు పూర్తి కాగా, చిలుకూరు చెరువులో కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. మడుపల్లి వాగులో సగం పనులు పూర్తి కాగా, మధిర పెద్దచెరువులో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కురిసిన భారీ వర్షానికి చెరువుల్లోకి నీరు రావటంతో మిషన్ కాకతీయ పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ పనులను మార్చి నెలలోనే ప్రారంభించినట్లయితే అన్ని చెరువుల పనులు పూర్తయ్యేవని రైతులు పేర్కొంటున్నారు. కాగా మధిర పెద్ద చెరువుకు అలుగులు పడటంతో గండ్ల ద్వారా వృథాగా నీరు పోతుందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. గండ్లను పూడ్చివేసి నీరు వృథాగా పోకుండా చూడాలని డిమాండ్ చేశారు. కాగా పెద్ద చెరువులో నీరు వచ్చి చేరటంతో మిషన్ కాకతీయ పనుల కోసం చెరువులో ఉన్న ప్రొక్లెయిన్ నీటిలో మునిగిపోయింది. శనివారం పగలంతా చెరువులో పని చేసి సాయంత్రం వర్షం రావటంతో పనులను ఆపివేశారు. ఊహించని విధంగా ఒక్క రాత్రే చెరువుల్లోకి భారీగా నీరు చేరటంతో ఆ పొక్లెయిన్ అందులోనే ఉండిపోయింది.